మనసు చెప్పిన మాట మాత్రమే వినాలి...దగ్గుబాటి రాణా
లీడర్, దమ్ మారో దమ్, నేను నా రాక్షసి చిత్రాలతో పరిచయమైన దగ్గుపాటి రాణాకి ఇప్పటివరకూ విజయం పలకరించలేదు. అయితే సినిమాలు మాత్రం కంటిన్యూగా చేస్తున్నాడు.రాణా ప్రస్తుతం సైమంటేనియస్ గా రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు ఒకటి నా ఇష్టం కాగా రెండోవది రామ్ గోపాల్ వర్మ డిపార్టమెంట్ లో చేస్తున్న రాణా తాజాగా మరో చిత్రం కమిటయ్యారు. క్రిష్ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది. క్రిష్ ఆ చిత్రాన్ని తానే స్వయంగా ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తానే నిర్మించదలిచారు. ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించి ప్రి ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. మరో ప్రక్క రాణా .. 'నా ఇష్టం" టైటిల్ తో రూపొందే ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామిడీగా రూపొందుతోంది. అందాల హాసిని జెనీలియా డిసౌజా హీరోయిన్ గా, ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సక్సస్ ఫుల్ యువనిర్మాత పరుచూరికిరీటి నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రం 'నా ఇష్టం'.
రాణా కథానాయకుడిగా, జెనిలియా కథానాయకిగా నటిస్తున్న చిత్రం 'నా ఇష్టం'. ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తుండగా ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు. చక్రి ఈచిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఇటివలే ముఖ్య సన్నీవేషాలని రామోజీ ఫిలింసిటీ లో తెరకెక్కించారు. హీరో రాణా మాట్లాడుతూ "పది మంది కోసం బతకడంలో తప్పులేదు. కాని వాళ్ళకు నచ్చిన విధంగా జీవించాలి అనుకోవడంలో అర్థం లేదు. మనకంటూ కొన్ని ఇష్టాలు, అభిరుచులు వుంటాయి వాటికీ అనుగుణంగానే వుండాలి అనుకునే యువకుడి జీవితాన్ని" ఈ చిత్రంలో చూపిస్తున్నాం అని చెప్పారు.
నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ "మనసు చెప్పిన మాట మాత్రమే వినాలి అనుకునే యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది అతని ఆలోచనలు, పద్దతులు చూసి కొందరు అపార్దం చేసుకుంటారు. ఎవరు ఎం అనుకున్న నా ఇష్ట ప్రకారమే జీవిస్తాను అనుకుంటాడు, కథానాయకతో పరిచయం కలిగిన తరువాత అతను ఏమిన మారాడ లేక ఆమెనే మర్చేశాడా అనేది తెర మిద చూడాలి" అని చెప్పారు. దగ్గుబాటిరాణా, జెనిలియా, నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:చక్రి, నిర్మాత: పరుచూరు కిరీటి, దర్శకత్వం: ప్రకాష్ తోలేటి.


Click it and Unblock the Notifications











