ఆర్‌ఎఫ్‌సిలో ‘నాఇష్టం’ అంటున్న రాణా, జెన్నీ
ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో రాణా దగ్గుబాటి, జెనిలియా జంటగా నటిస్తున్న సినిమా 'నా ఇష్టం". ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమాలోని ప్రధాన పాత్రలపై ఇక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షెడ్యూల్‌తో మొత్తం చిత్రీకరణ పూర్తి కానుంది.
నా ఇష్టం సినిమా గురించి సినిమా యూనిట్ సభ్యులు వెల్లడిస్తూ...ఈ సినిమా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోందని, రాణా జెనీలియా మధ్య చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయంటున్నారు. యువత మెచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయన్నారు. యూనైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చక్రి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న వారిలో బ్రహ్మానందం, నాజర్, సుబ్బరాజు, ఆహుతి ప్రసాద్, అలి, ఉత్తేజ్ ప్రగతి తదితరులు నటిస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











