రానాకి ప్రత్యేక కానుక ...ఫుల్ హ్యాపీ
హైదరాబాద్ శాకాహారం వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకొన్న ఆమీర్‌ఖాన్ మాంసాహారానికి దూరమై శాకాహారిగా మారిపోయాడు. ఇప్పుడు ఆ జాబితాలో యువ కథానాయకుడు రానా కూడా చేరిపోయాడు. ఇక నుంచి మాంసాహారానికి దూరంగా ఉండాలని రానా నిర్ణయించుకొన్నాడట. ఈ నిర్ణయాన్ని వెంటనే అమలులో పెట్టేశాడు.
దాంతో పెటా (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఏనిమల్స్) సంస్థ కూడా రానాకి అభినందనలతో సందేశాన్ని పంపింది. దాంతో పాటు బిస్కెట్లూ, చాక్లెట్లూ, సోయా పాలతో తయారు చేసిన పదార్థాలను బహుమతిగా అందించింది. ఈ విషయాన్ని రానా ట్విట్టర్‌లో ప్రస్తావించారు. ప్రస్తుతం రానా 'బాహుబలి', 'రుద్రమదేవి' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. 'దొంగాట'లో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక రానా చేస్తున్న 'బాహుబలి' విషయానికి వస్తే...
రాజమౌళి దర్శకత్వంలో భారతీయ సినిమా పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'బాహుబలి'. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రధారులు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను రానా తన ట్విట్టర్ పేజీలో పెట్టారు.
ఈ చిత్రంలో భళ్లాలదేవుని పాత్రలో రానా కనిపిస్తారు. ఆ పోస్టర్‌లో రానా యుద్ధ రంగంలో గద పట్టుకొని భీకరంగా కనిపిస్తున్నారు.చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కళ: సాబు సిరిల్, సమర్పణ: కె.రాఘవేంద్రరావు.
మరో ప్రక్క ప్రభాస్, రానా ఇద్దరూ గెస్ట్ లుగా ఓ తమిళ చిత్రంలో కనిపించనున్నారా...అంటే అవుననే వినపడుతోంది. ఆ చిత్రం మరేదో కాదు...సూర్య నటిస్తున్న మాస్ చిత్రం. ఈ చిత్రంలో వీరిద్దరూ కొద్ది క్షణాలు సేపు అలా కనపడే కీలకమైన పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. ఈ మేరకు షూటింగ్ కూడా జరిగిందని చెప్పుకుంటున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











