twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్, అభిషేక్ బచ్చన్ ల మధ్య గొడవ.. మధ్యవర్తిగా రాణా

    By Kuladeep
    |

    టాలీవుడ్ మ్యాన్లీ హీరో ప్రభాస్ కు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కు మధ్య ఓ చిన్నపాటి గొడవతలెత్తింది. దీనికి కారణం ఓ హెయిర్ స్టయిలర్ కావడం విడ్డూరమే అయినా ఇది అక్షర సత్యం. భారతీయ సినీ పరిశ్రమలో హకిమ్ ఆలిమ్ అంటే తెలియని వారుండరు. వెరయిటీ హయిర్ స్టైల్స్ చెయ్యడంలో పేరొందిన ఈయనకు బాలీవుడ్, టాలీవుడ్ హీరోల వద్ద మంచి డిమాండ్ వుంది. ఇటీవలే హకిమ్ హైదరాబాదు వచ్చినప్పుడు ప్రభాస్ అతని అపాయింట్ మెంట్ తీసుకున్నాడట.. తన హెయిర్ స్టల్ మార్చుకోవడానికి. సరిగ్గా అప్పుడే అభిషేక్ బచ్చన్ నుండీ ఫోన్ వచ్చిందట హకిమ్ కు వెంటనే రమ్మని.. తనకు అర్జెంటుగా హెయిర్ స్టైల్ ఛేంజ్ చేసుకోవాల్సి వచ్చిందని. తను హైదరాబాదులో వున్నానని చెప్పినా అయితే ఏంటి నెక్ట్స్ ఫ్లైట్ కు ముంబై రమ్మని అడిగాడట అభి. మరోవైపు ప్రభాస్ కూడా వెయిట్ చెయ్యడానికి ససేమీరా అన్నాడట.

    దీంతో ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో వున్న హకిమ్ కు అభిషేక్ స్నేహితుడు, మన 'లీడర్' రాణా సాయపడ్డాడట. రాణా ప్రభాస్ కు ఫోన్ చేసి బుజ్జగించడంతో హకిమ్ ముంబై వెళ్లడానికి అంగీకరించాడట ప్రభాస్. దీంతో హమ్మయ్యా అనుకుంటూ హకిమ్ ముంబై వెళ్లి అభికి హెయిర్ స్టయిల్ ఛేంజ్ చేసి వెంటనే హైదరాబాదు వచ్చేసాడట ప్రభాస్ కోసం. ఇప్పుడు ప్రభాస్ కు వున్న కొత్త హెయిర్ స్టైల్ హకిమ్ చేసిందే. ఈ మాత్రం హెయిర్ స్టైల్ కే దెబ్బలాడుకోవాలా అనే ప్రశ్న మీదయితే సమాధానం మా దగ్గర లేదు..ఇంతకీ రాణాకు, అభికి మధ్య ఎక్కడ సయోధ్య కుదిరింది అనుకుంటున్నారా..? ప్రస్తుతం వీరిద్దరూ కలసి ఓ హిందీ సినిమాలో నటిస్తున్నారు లెండి దీంతో మంచి మిత్రులయిపోయారట.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X