అల్లు అర్జున్ బ్యాచులర్ పార్టీకి రాణా భారీ ఏర్పాటు
అల్లు అర్జున్ ఆదివారం స్నేహారెడ్డిని వివాహం చేసుకుని బ్యాచిలర్ లైఫ్‌కి స్వస్తి చెప్పనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ స్నేహితుడు సందీప్‌తో కలిసి రాణా 'బ్యాచిలర్స్ పార్టీ" ఏర్పాటు చేశారు.ఇందుకోసం భారీగా రాణా ఓ సెట్ ని వేయించారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఓ సెట్ వేయించారు. ఆ సెట్‌కైన ఖర్చు 2 నుంచి 3 లక్షల లోపు ఉంటుంది. కళాదర్శకుడు చిన్నా ఆధ్వర్యంలో ఈ సెట్ రూపొందింది. ఈ పార్టీలో తన కాబోయే భార్య స్నేహారెడ్డితో అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఇంకా బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేస్తున్న హీరోలు ప్రభాస్, రామ్‌చరణ్, రామ్, సుమంత్, వరుణ్ సందేశ్, అల్లరి నరేష్, శర్వానంద్, నాని, నవదీప్, దర్శకులు క్రిష్, కె.ప్రకాష్, అజయ్‌శాస్త్రి, అల్లు అర్జున్ సోదరుడు బాబీతో పాటు మంచు లక్ష్మీ, అర్చన, మధుశాలిని, కృతి కర్భందా తదితరులు కూడా పాల్గొన్నారు. ఇక ఈ వివాహం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ...తనది ప్రేమ వివాహం అని మీడియాలో వచ్చిందని, అయితే అది నిజం కాదని, ఓ పార్టీలో తాము ఇద్దరం పరిచయం అయ్యామని, ఆ తర్వాత తమ అభిరుచులు కలవటంతో తమ కుటుంబ సభ్యులకు చెప్పటం వారు నిశ్చితార్దం ఏర్పాటు చేయటం జరిగిందని అని చెప్పుకొచ్చారు. ఇబ్రహీంపట్నంలో బిటెక్ చేసి అమెరికాలో ఎమ్మెస్ చేసిన స్నేహారెడ్డి తండ్రికి విద్యాసంస్థలు ఉన్నాయి. అల్లు ఆర్జున్ కు స్నేహారెడ్డితో గత సంవత్సర కాలంగా పరిచయం ఉంది.


Click it and Unblock the Notifications











