బాహుబలి: రానా చేతికి తీవ్రమైన గాయం (ఫోటో)
హైదరాబాద్: రానా దగ్గుబాటి చేతికి తీవ్రమైన గాయం అయింది. తన ఎడమచేతి నాలుగు వేళ్లు కాలిపోయాయి. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించడంతో పాటు అందుకు సంబంధించిన ఫోటో కూడా పోస్టు చేసాడు. ‘నాకు తీవ్రమైన గాయం అయింది. నా ఐదు వేళ్లలో నాలుగు వేళ్లకు కాలిన గాయాలయ్యాయి. దయచేసి ఇది ఎలా జరిగింది అని మాత్రం అడగొద్దు' అంటూ రానా ట్వీట్ చేసారు.
రానా ఇప్పటికే ‘రుద్రమదేవి' షూటింగుతో పాటు, హిందీ మూవీ ‘బేబీ' షూటింగు పూర్తి చేసాడు. ప్రస్తుతం అతడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ షూటింగులోనే అతని చేతికి గాయమైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బాహుబలి షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. ఇక్కడ పలు కీలక సీన్లు చిత్రీకరించనున్నారు. ఆర్కా మీడియా బేనర్లో ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని తెలుస్తోంది. తొలి భాగం 2015లో విడుదల కాబోతోంది.
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో ‘బాహుబలి' చిత్రం తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడమే లక్ష్యంగా టీం మొత్తం కష్టపడి పని చేస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం ఈ చిత్రం తెలుగు ప్రాంతానికో, ఇండియాకో పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ లెవల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగిన విధంగానే చిత్రీకరణ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











