‘డిపార్టుమెంట్’ సెట్ లో రాణాకు గాయాలు
తెలుగు యువహీరో 'రాణా" గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న డిపార్టుమెంటు చిత్ర షూటింగులో భాగంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం...ముంబై నగర శివార్లలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుండగా ఇది జరిగింది. రాణా మోకాలు, మరియు భుజానికి గాయాలయ్యాయి. ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా రాణా ఒక బాక్స్ పై నుంచి మరో బాక్సు పైకి దూకే నేపథ్యంలో అదుపు తప్పి కింద పడి పోయాడు. సినిమా యూనిట్ సభ్యులు వెంటనే అతనికి ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. అవేమీ పెద్ద సీరియస్ గాయాలు కావని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
డిపార్టుమెంటు చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రాణా ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, కంగన రనౌత్, రవీనా టండన్, అభిమన్యు సింగ్, మధుశాలిని తదితరులు ఇందులో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











