»   » స్పెషల్ ఇంటర్వ్యూ:బాహుబలి గురించి మరిన్ని ఆసక్తిక విషయాలు...

స్పెషల్ ఇంటర్వ్యూ:బాహుబలి గురించి మరిన్ని ఆసక్తిక విషయాలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను అమరేంద్ర బాహుబలిగా తెరపై చూపించడానిిక దర్శక ధీరుడు రాజమౌళి మూడేళ్ల ప్రయత్నమే ‘బాహుబలి'. హీరోయిజాన్ని హైరేంజిలో ఎలివేట్ చేసే రాజమౌళి, విలనిజాన్నీ అంతకంటే ఎక్కువగానే తెరపై ఆవిష్కరిస్తాడు. బాహుబలి వంటి ధీరుడికి సరిజోడు భల్లాలదేవ. ఆ రేంజ్ విలనిజాన్ని చూపించగల ప్రతినాయకుడు. తనకి దేవుడంటే నమ్మకం లేదు కానీ ఆరాధన నమ్ముతాడు...ఎందుకంటే తనని తాను దేవుడని నమ్ముతాడు. ఇదే భల్లాలదేవ క్యారెక్టర్ అని అంటున్నాడు రానా. బాహుబలి జులై 10న మన ముందుకు రానున్న నేపథ్యంలో రానా చెప్పిన విశేషాలు.

36 కిలోలు పెరిగాను..
బాహుబలి షూటింగుకి వెళేల ముందు ఆరు నెలలు పాటు ట్రైటింగ్ తీసుకున్నాం. షూటింగ్ వెళ్లడానికి ముందు 86 కిలోలు ఉన్న నేను షూటింగ్ టైమ్ వచ్చేసరికి 122 కిలోలయ్యాను. 36 కిలోలు వెయిట్ పెంచాను. రోజుకి ఆరుసార్లు, ఎనిమిది సార్లు, తొమ్మిది సార్లు ఇలా విపరీతంగా తిని దానికి తగిన విధంగా ఎక్సర్ సైజులు చేసే వాడిని. మూడేళ్లు అదే వెయిట్ మెయింటేన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.


RANA interview about Baahubali interview

ట్రైయినింగ్ గురించి...
పీటర్ హెయిన్స్ వియత్నాం నుండి ముగ్గురు ఫైట్ మాస్టర్స్ ను సన్, తన్, లక్ లను తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. ఇదొక ఇండియన్ వార్ ఫిలిం అందుకని స్క్రీన్ పై చూపించాలనుకునే వార్ సీన్స్ మను తగిన విధంగా రియాల్టీకి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసారు. వెపన్స్ ను రీమాడ్యూల్ చేసారు. మా సినిమాలో నా ఆయుధం గద. దగ్గరగా చూడటానికి గతలా ఉండి, దూరంగా చూడటానికి చైన్ లా కనబడుతుంది. ప్రతి సీన్ కి తగిన విధంగా ఆరు రకాల వెపన్స్ ను వాడాము. అలాగే డైతాగ్స్ చెప్పేప్పుడు తెలుగుతో పాటు, తమిళంలో కూడా చెప్పాలి. తమిళ డైలాగ్స్ ఇంగ్లీషులో రాసి పంపారు. అవి గ్రాంథిక తమిళంలో ఉండటం వల్ల చదువుతున్నప్పటికీ నాకు అర్థం కాలేదు. ఆ డైలాగ్స్ రాసిన వైరముత్తు తనయుడు మనద్ కర్కేను కాంటాక్ట్ చేసి తను రాసిన డైలాగ్స్ చదివి కూడా వినిపించమని చెప్పాను. తీరా ఒక రిథమ్ లో డైలాగ్స్ నేర్చుకుని వచ్చిన తర్వాత డైలాగ్సే మార్చేసారు. దాంతో నేను యూనిట్ ను తమిళంలో మత్రం నేను డైలాగ్స్ చెప్పే విషయంలో కొద్దిగా పర్మిషన్ తీసుకుని ఎలాగలాగో మేనేజ్ చేసేసాను. ఇలా చేయడం వల్ల షూటింగ్ వెళ్లేటప్పటికీ అన్ని సిచ్చువేషన్స్ మా కంట్రోల్ కి వచ్చాయి. లేకుంటే ఇలాంటి సినిమాని చేయడం సులువుకాదు.


ఇలాంటి సినిమా చేస్తానో లేదో.,....
రాజమౌళి, ప్రభాస్ సినిమా చేస్తున్నారని విన్నాను కానీ ఏ సినిమా, ఏంటని తెలియలేదు. ఒక రోజు శోభుగారు మా ఇంటికి వచ్చి రాజమౌళిగారు చేయబోయే సినిమాలో విలన్ క్యారెక్టర్ ఉంది. దాన్నొక హీరో చేస్తే బావుంటదని అన్నారు. రాజమౌళి గారు కథ వినగానే నేను సార్ ఎగ్జైట్మెంటుతో ఎక్కడ ఎస్ చెప్పేస్తానో కొంచెం ఆలోరించుకునే సమయం కావాలన్నాను. నేను సినిమా వాతావరణంలో పెరిగాను. చిన్నప్పటి నుండి ట్రాయ్, 300 వంటి సినిమాలు చూసినపుడు మనకు ఇంత మంచి కథలు ఉన్నాయి మనమెందుకు తీయలేమని అనుకునే వాడిని అలాంటి నాకు ఇలాంటి కథ చెప్పినపుడు సినిమా వెంటనే చేసేయాలి అనుకున్నాను. గతంలో ఎన్టీఆర్, ఎఎన్ఆర్ చేసిన పురాణ సినిమాలన్నీ తెలుగు సినిమా నిర్మాణంలో పార్ట్స్. సాధారణంగా నేను రాజ్యాలు, రాజులకు సంబంధించిన కథలున్న సినిమాలన్నీ ముందు చూస్తుంటాను. ఎందుకంటే అటువంటి సినిమాలు మనల్ని ఒక లోకంలోకి తీసుకెళ్లి వాటితో పాటు ట్రావెల్ చేయిస్తాయి. నాకు చిన్పప్పటి నుండి ఇలాంటి సినిమాలే ఫేవరెట్ జోనర్ మూవీస్. రాజమౌళి గారు ఈ కథను గంటన్నరపాటు చెప్పారు. ఇలా చెప్పేటపుడు కథకు సంబందించిన పిక్చర్స్ అన్ని చూపిస్తూ ఎక్స్ ప్లయిన్ చేసారు. అలా చెప్పేటప్పుడు మనల్ని ఆయన ఆ కథలోకి తీసుకెళతారు. అలా చెప్పినపుడు ఇటువంటి సమయంలో ఈ సినిమా చేయడం కరెక్టా కాదా? అని అలోచించాను. రాజమౌళిగారిని కూడా అదే విషయం అడిగితే ఆయన నేను నీకు కథ, అందులో నీ క్యారెక్టర్ చెప్పాను. నిర్ణయం నీదే అన్నారు. ఇలాంటి పీరియాడిక్ సినిమా మళ్లీ నా సినీ కెరీర్లో వస్తుందా? మళ్లీ చేస్తానో లేదో? అని ఆలోచించాను. వెంటనే ఆయన దగ్గరకెళ్లి ఓకే చెప్పాను.


RANA interview about Baahubali interview

భల్లాలదేవ క్యారెక్టర్...
భల్లాలదేవ క్యారెక్టర్ చాలా డిఫరెంటుగా ఉంటుంది. దేవణ్ణి నమ్మడు కానీ ఆరాధనను నమ్ముతాడు. ఎందుకంటే తనని ఒక దేవుడిలా భావిస్తుంటాను. భల్లాలదేవుని వైపు నుండి చూస్తే అతను చేసింది కరెక్ట్. ఈ సినిమాలో గ్రే క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. పవర్ కోసం, రాజ్యం కోసం అలా జరిగి ఉంటుందేమో అనేలా సినిమా నడుస్తుంది. బాహుబలి, భల్లాలదేవ ఇద్దరూ తాము ఎంచుకున్న బాటను బాగా నమ్ముతారు. ఈ సినిమాకి ముందు నా ర్యారెక్టర్ గురించి పూర్తిగా చెప్పి, నాకు సంబంధించిన డాక్యుమెంట్ ను చదవమని చెప్పి పూర్తిగా ఇన్ వాల్వ్ చేయించారు. రాజమౌళిగారు చెప్పే విధంగా, యాక్టర్ష్ నుండి నటన రాబట్టుకునే తీరు అద్భుతం. అందుకే రాజమౌళి సినిమాలోని క్యారెక్టర్స్ ఆడియన్స్ కి అద్భుతంగా అనిపిస్తాయి.


చిన్నపాటి గర్వం...
ఎవరూ చేయని ఒక సినిమా చేస్తున్నామని ఒక చిన్నపాటి గర్వముండేది. ఇపుడు ఆలోచిస్తే ఇంత పెద్ద సినిమాని ఎలా చేసామా అని అనిపిస్తుంది. రెండు వేల మంది ఆర్టిస్టులతో పెద్ద వార్ సీక్వెన్స్ చేసాము.


నా విగ్రహం చూసి షాకయ్యాను
పీటర్ హెయిన్స్ ఫైట్ మాస్టర్ కాదు...ఫైట్ ఇంజనీర్. ప్రతి యాక్షన్ సన్నివేశాన్ని అద్భుతంగా డిజైన్ చేసారు. ఇందులో నా విగ్రహం ఎత్తు 130 అడుగులు ఉంటుంది. ఎనిమిదిన్నర టన్నుల వెయిట్ ఉండేది. ఆ విగ్రహాన్ని నిలబెట్టడానికి నాలుగు భారీ క్రేన్స్ తప్పించారు. విగ్రహం నిలబెట్టే సన్నివేశానికి పన్నెండు రోజుల సమయం పట్టింది. చివరికి అంత పెద్ద విగ్రహం చూడగానే షాకయ్యాను.


RANA interview about Baahubali interview

ఆరోజు నేను పడ్డ కష్టాన్ని మరిచి పోయాను
వార్ సీక్వెన్స్ చలికాలంలో చేద్దామని ముందు ప్లాన్ వేసుకున్నాం. అయితే మధ్యలో ప్రభాస్ భుజానికి ఆపరేషన్ జరుగడం, నాకు మోకాలి దగ్గర గాయం కావడంతో దాదాపు మూడు నెలలు ఆ పార్ట్ పస్ట్ పెన్ చేసారు. చివరికి మండు వేసవిలో వార్ సీక్వెన్ష్ చేయాల్సి వచ్చింది. నా కోసం, ప్రభాస్ కోసం రాజమౌళి గారు రాజస్థాన్ నుండి ప్రత్యేకంగా గుర్రాలను తెప్పించి వాటిని ట్రైన్ చేసినా అవి మొరాయించేవి. వార్ సీక్వెన్స్ లో రథంపై వెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ఉదయం పదకొండు గంటల నుండి ఆరు గంటల వరకు సమయం పట్టింది. ఏంటి ఒక షాట్ కోసం ఇంత టైమ్ పట్టిందే అని అనుకున్నాను. తీరా ఆ సీన్ ను మానిటర్ లో చూడగానే ఎక్సలెంట్ గా అనిపించి అప్పటి వరకు పడ్డ కష్టాన్నంతా మరిచిపోయాను.


వార్ సీక్వెన్స్ టైమ్ లో రెండు వేల మందికి పైగా ఆర్టిస్టులు పని చేసేవారు. రోజూ ఎవరికో ఒకరికి గాయాలవుతుండేవి. మా సెట్లో అంబులెన్స్ సైరన్ వినిపించేది. హమ్మయ్య ఈ రోజు మనం కాదు అని అనుకునే వాడిని. ఓ వార్ సీక్వెన్స్ లో ఆరుగురితో ఫైట్ చేయాల్సి ఉంది. దానికోసం ప్రాక్టీస్ చేస్తుండగా ఎలా జరిగిందో తెలియదు కానీ నా మోకాలికి గాయమైంది. ప్రభాస్ అయితే బావా దరిద్రం నిన్ను చేస్ చేస్తుంది. ఏమీ చేయలేం అన్నాడు. నెల రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా విషయంలోనే కాదు కృష్ణం వందే జగద్దురుమ్ టైంలో చేతికి దగ్గర గాయమైంది. ఇలా చాలా గుర్తులున్నాయి. చెప్పడం మరిచిపోయాను కానీ ఈ సందర్భంలో చెప్పాలి. రాజస్థాన్ నుండి రాజమౌళిగారు తెప్పించిన గుర్రాలపై ట్రైనింగ్ తీసుకుంటున్నపుడు నేను ముందుకు వెలుతున్నాను. నా వెనక ప్రభాస్ వస్తున్నాడు. గుర్రం వెలుతుంది..కంట్రోల్ కావడం లేదు. వెనక నుండి ప్రభాస్ వెనక నుండి తంతుంది చూసుకో అని అరుస్తున్నారు. ఏం చేయాలో తెలియక గుర్రాన్ని పక్కకి తిప్పాను. ఎలాగో ఆపేసాను కానీ...నేను మాత్రం గాలిలో ఎగిరి కిందపడ్డాను. చిన్న గాయాలయ్యాయి. పడేటప్పుడు తల ముందు నేలకు ఆనింది కాబట్టి ట్రైనర్ మాత్రం డాక్టర్ దగ్గరకి వెళ్లాల్సిందేనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్ చెక్ చేసి చేసిన ఎక్సర్ సైజులు, ట్రయినింగ్, బాడీ బిల్డింగ్ కారణంగానే చిన్న గాయాలతో తప్పించుకున్నావ్ లేకుంటే మినిమమ్ నాలుగు ఫ్రాక్టర్స్ అయ్యేవని అన్నారు. అవన్నీ ఇపుడు తలుచుకుంటే భయమేస్తుంది.


ఆయన్ని చూసి ఇన్ స్పైర్ అయ్యాను.
నేను చెన్నైలో పుట్టి పెరిగాను. చిన్నపుడు కమల్ హాసన్ గారి ‘నాయగన్' సినిమా విడుదలైంది. ఆ సినిమాలో ఆయన వేసిన ముసలివాడి గెటప్ పెద్ద కటౌట్ గా చూసాను. ఆ టైమ్ లో ఆయన మంచి ఏజ్ లో ఉండేవారు. అలాంటాయన ముసలివాడిగా చేయడం చూసి ఆశ్చర్యపోయాను. ఆ గెటప్ చూసి ఇన్ స్ప్రైర్ అయ్యాను. కాబట్టి ఈ సినిమాలో నేను కూడా మిడిల్ ఏజ్ లో నటించడానికి రెడీ అయిపోయాను.


అదృష్టంగా పీలవుతున్నాను
నేను ఇప్పటి వరకు చూసిన విలన్స్ లో, రాజమౌళి గారు ఇప్పటి వరకు చేసిన సినిమాలోని విలన్స్ లో భల్లాలదేవానే పవర్ ఫుల్. ఇటువంటి సినిమా చేయడం అదృష్టంగా ఫీలవుతాను.


RANA interview about Baahubali interview

ఆయనే ముందు ఆ మాటన్నారు..
నాన్నగారు ఇటువంటి వరల్డ్ క్లాస్ మూవీని హిందీలోకి తీసుకెళితే బావుంటుంది. కరణ్ జోహార్ తో మాట్లాడమని అన్నారు. ఏ జవానీ హై దివానీ చిత్రంలో నేను గెస్ట్ రోల్ చేసి ఉండటం వల్ల నాకు ఆయనతో పరిచయం ఉంది. దాంతో నేను ఆయనకి ఫోన్ చేసి సినిమా గురించి చెప్పాను. ఆయనైతే ముందు నువ్వు ముంబైకి రా మాట్లాడుకుందాం అన్నారు. నేను వెళ్లి ఆయన్ను కలిసి కత వినిపించాను. ఆయన నిజంగానే తీస్తున్నారా? అని అడిగారు. నేను కొన్ని ఫోటోస్ చూపించాను. ఇండియన్ అవతార్ లా ఉందన్నారు. అంతే కాకుండా ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అనే మాట ముందు ఆయన నోటి నుండే విన్నాను.


ఆయన అలా చెప్పడం మరిచిపోలేను
అమితాబ్ బచ్చన్ గారు ట్రైలర్ చూసి ఆశ్చర్యపోయారు. ఎక్కడ తీస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాతో చాలా సేపు సినిమాల గురించి మాట్లాడారు. ఈ సినిమా ముందు నేను చిన్నగా కనిపిస్తున్నాని అన్నారు. అంతపెద్ద నటుడు అలా చెప్పడం మరిచిపోలేను.


నిర్మాతలు గ్రేట్..
ఇటువంటి సినిమాలు తీయాలంటే ముందు నిర్మాతలు ధైర్యంగా ఉండాలి. వారి ఫేస్ లో ఎక్కడైనా ఆందోళన కనపడితే అది టోటల్ టీమ్ పై ఎఫెక్టు చూపెడుతుంది. శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిగారు ఆ విషయంలో చాలా గ్రేట్. శోభుగారే సెట్ లో ఎక్కువగా ఉండే వారు. ఎప్పుడు చూసినా ఆయన నవ్వుతూ ఉండే వారు. ప్రభాస్ అయితే బావ ఇంకెవరో నిర్మాతలు డబ్బు ఖర్చుపెడుతున్నట్లు ఆయన చూడు ఎంత కూల్ గా ఉన్నాడో అనేవాడు. బాహుబలి అనే ఇంటర్నేషనల్ ప్రాజెక్టు చేస్తున్నామనే నమ్మకంతో ఈ సినిమాని పూర్తి చేసారు.


నెక్టస్ ప్రాజెక్టు..
ఈ సినిమా షూటింగ్ టైమ్ లో ప్రభాస్ భుజం ఆపరేషన్ తో హాస్పిటల్‌లో రెండు నెలలు రెస్టు తీసుకున్నాడు. ఆ గ్యాప్ లో నేను బేబీ సినిమా చేసాను. ఇపుడు తమిళంలో బెంగుళూరు డేస్ మూవీ చేసాను. నా పార్ట్ అంతా పూర్తయిపోయింది. ఇక బాహుబలి పార్ట్ 2 షూటింగ్ దాదాపు సగం పూర్తయింది. మిగిలిన దాని కోసం మళ్లీ బాడీ బిల్డ్ చేయాలి. ఇది పూర్తయ్యాకే నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను.

English summary
RANA interview about Baahubali interview.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu