తాతాయ్య అడుగు జాడల్లో రాణా!
తాతయ్య రాణా అడుగుజాడల్లోనే నడుస్తానని అంటున్నాడు 'లీడర్" రాణా. తొలి చిత్రంలో పొలిటీషియన్ గా తాతయ్యగారి బాడీ లాంగ్వేజ్ ని పదే పదే చూసి చూసి అలా కన్పించే ప్రయత్నం చేశానని రాణా చెప్పుకొచ్చాడు. ఓ నిర్మాతగా తాతయ్య రామానాయుడు చేసిన సూచనల్ని దష్టిలో పెట్టుకున్నాననీ, షూటింగ్ స్పాట్ లో ఒక్క నిమిషం కూడా వధా కానివ్వకూడదన్న తాతయ్యగారి సూచలనల మేరకు 'లీడర్" సినిమా చేశానని చెబుతున్నాడు రాణా.
బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ, క్రమశిక్షణలోనూ తాతయ్యే తనకు ఆదర్శమంటోన్న రాణా, సినిమాకి ముందు చాలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేశాననీ, అందుకే సినిమా షూటింగ్ లో పెద్ద గా ఇబ్బందులు తలెత్తలేదనీ అంటున్నాడు. 'లీడర్" సినిమాకి ముందు ఫలానా సినిమా చేయాలనే ఓ ఐడియా వుండేదనీ, ఇప్పుడు ఫలానా సినిమా కాదు. కొత్తగా సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చానంటోన్న రాణా, తదుపరి ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే వుందని చెప్పుకొచ్చాడు. దర్శకుడు శేఖర్ కమ్ములతో వర్కింగ్ ఎక్స్ పీియన్స్ చాలా బాగుందనీ, దర్శకుడిగా అతని ఆలోచనా విధానం సరికొత్తగా వుంటుందనీ కితాబులిస్తున్నాడు రాణా.


Click it and Unblock the Notifications











