రాణా వ్యవహారంతో అమ్మా, నాన్నా తీవ్రమైన మనోవేదన...శ్రియ
అమ్మనాన్నలు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. ప్రతిసారీ సర్దిచెప్పుకోవడం కష్టమే. అంటోంది శ్రియ. రాణాతో తనకి రిలేషన్ ఉందని వచ్చిన వార్తలకు ఇంట్లో వారు టెన్షన్ పడుతున్నారని మీడియా వద్ద వాపోయింది. అలాగే నేను ఇలాంటివి పెద్దగా పట్టించుకోను. కానీ ఇంట్లోవాళ్లు అలా కాదుగా అంది. ఇక రాణా గురించి మరోసారి చెప్తూ...రాణా చిన్నప్పటి నుంచీ తెలుసు. అంతే... అంతకు మించి మా ఇద్దరి మధ్యా ఏం లేదు.నేను ఇంకా ఒంటరినే. ఇప్పటికి ఇలా ఉండడానికే ఇష్టపడుతున్నాను అంది. ప్రస్తుతం దీపా మెహతా సినిమా కోసం శ్రీలంకలో ఉంది.ఇక రాణా,శ్రేయ కలిసి తిరిగుతున్నారని ముంబై మీడియాలో వార్తలు ఫొటోలు వచ్చాయి.అక్కడికి వెళ్ళిన రాణా ఆమెను కలవకుండా రాడని, ఇద్దరూ రాత్రింబవళ్ళూ కలిసే ఉంటారని అక్కడ డైలీలు ప్రముఖంగా ప్రచురించాయి.
అలాగే తాను ప్రస్తుతం దృష్టి దీపా మెహతా తెరకెక్కిస్తున్న 'మిడ్‌నైట్ చిల్డ్రన్' సినిమా మీదే పెట్టానని చెప్తోంది.ఆ సినిమా గురించి చెబుతూ.. సల్మాన్ రష్దీ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమది. రష్దీ గొప్ప రచయిత. ఆయన రచనలన్నీ ఎంతో ఆర్ధ్రంగా ఉంటాయి. ఇప్పటికే 'మిడ్‌నైట్ చిల్డ్రన్' చాలాసార్లు చదివాను. ఆ సినిమాలో నా పాత్ర గురించి ఇప్పుడే చెప్పలేను. కానీ మంచి సినిమాగా నిలిచిపోతుందనే నమ్మకం ఉందని అంది. ప్రస్తుతం శ్రియ ...మంచు మనోజ్ ప్రక్కన మరో చిత్రం కమిటైంది.


Click it and Unblock the Notifications











