రానాతో లవ్ ఎఫైర్ గురించి త్రిష వివరణ
హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన హీరోయిన్ త్రిష ప్రస్తుతం తాను నటించిన ‘కళావతి' చిత్రం అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మంచి విజయం సాధించడంతో చాలా హ్యాపీగా ఉంది. అయితే సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఆమెకు మరోసారి రానాతో లవ్ ఎఫైర్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ నేపథ్యంలో మరోసారి తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది త్రిష. ‘నేను రానాతో డేటింగ్ చేస్తున్నానని, అతను నా బాయ్ ఫ్రెండ్ అంటూ మీడియాలొ ఏవేవో వార్తలు రాస్తున్నారు. అదంతా వాస్తవం కాదు. ఇండస్ట్రీలోని ఇతర హీరోల్లానే రానా కూడా నాకు ఒక మంచి స్నేహితుడు. మేము ఇద్దరం కలిసి మాట్లాడుకుంటే చాలా మీడియాలో ఏవేవో ఆధారం లేని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అదే విధంగా నేను ఇతర ఏ హీరోతోనూ లవ్ లో లేను. ప్రస్తుతం నేను సింగిల్' అని త్రిష స్పష్టం చేసింది.

త్రిష నటించిన కళావతి సినిమా వివరాల్లోకి వెళితే...
దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తమిళంలో ఆరణ్మనిగా... తెలుగులో ‘చంద్రకళ' గా ఆ మధ్య విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చంద్రకళ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందింది. ఈ చిత్రానికి ‘కళావతి' టైటిల్ తో విడుదల చేసారు. హార్ కామెడీ కావడంతో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.
సర్వంత్రామ్ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ సంయుక్తంగా తెలుగులో సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక మోత్వాని, పూనమ్ బాజ్వా ముఖ్య పాత్రలు పోషించారు. హార్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కించిన ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. హిప్ హాప్ తమీఝా సంగీతమందించారు. ఈ చిత్రానికి సంగీతం - హిప్ హాప్ తమిఝా, దర్శకుడు - సుందర్ సి, నిర్మాత - గుడ్ ఫ్రెండ్స్, సమర్పణ - శ్రీ జవ్వాజి రామాంజనేయులు.


Click it and Unblock the Notifications











