రాణా హీ ఈజ్ రియల్ ‘లీడర్’
దర్శకుడు శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమా లీడర్. ఈ సినిమా నిజమైన లీడర్ ఎలా ఉండాలి అన్న విషయంపై ఒక స్పష్టత కోసం తీస్తున్న సినిమా అని దర్శకుడు మీడియాకి వివరించారు. హ్యాపిడేస్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకత సంపాయించుకున్న శేఖర్ కమ్ముల ఆ తర్వాత తన బ్రాండ్ కొనసాగిస్తున్న తీరు చాలా గొప్పగా ఉంది.
ఇప్పుడు ఏవియం ప్రొడక్షన్స్ పై ఎం ఎస్ గుహన్, ఎం శరవణన్ లు అరుణ, అపర్ణ, లతో కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా లీడర్, ఇందులో మూవీ మొఘల్ రామానాయుడు మనుమడు రాణా తొలి సారి పరిచయం అవుతున్నాడు. ఇందులో సమాజానికి నిజమైన లీడర్ ఎలా ఉండాలి, నాయకత్వ లక్షణాలు ఏమిటి అన్న వాటితో ఒక సందేశం వచ్చేలా అదే సమయంలో మంచి హోమ్లీ మూవీ తీస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాలో రాణా సరసన రీచా గంగోపాధ్యాయ, ప్రియ లు కథానాయికలుగా నటిస్తుండగా కోట, తనికెళ్ళ భరణి, హర్ష వర్ధన్, సుబ్బరాజు, రావు రమేష్ లు సహనటులుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











