రాణా-క్రిష్ ‘కృష్ణం వందే జగద్దురుమ్’
దగ్గుబాటి యువ హీరో రాణా..గమ్యం, వేదం చిత్రాల దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. 'కృష్ణం వందే జగద్దురుమ్" అటే పేరును పరిశీలిస్తున్నారని, దాదాపుగా దీన్నే కన్ఫర్మ్ చేస్తారని సమాచారం. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. గతంలో ఈ సంస్థ బ్యానర్ పై గమ్యం సినిమా రూపొందించింది.
ఇప్పటి వరకు రాణా కెరీర్ లో ఫుల్ లెన్త్ యాక్షన్ సినిమా లేదనే చెప్పాలి. భిన్నమైన సినిమాలకు కేరాప్ అడ్రస్ గామారిన క్రిష్ కూడా....ఇప్పటి వరకు యాక్షన్ నేపథ్యాన్ని ఎంచుకోలేదు. తాజాగా 'కృష్ణం వందే జగద్దురుమ్" సినిమా యాక్షన్ అంశాలతో కూడుకుని ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు. ప్రస్తుతం రాణా తెలుగులో నా ఇష్టం, హిందీలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో డిపార్టుమెంట్ చిత్రంలో నటిస్తున్నారు. భిన్నమైన నటనాశైలి కలిగిన రాణా, భిన్నమైన సినిమాలు తీసే దర్శకుడిగా పేరొందిన క్రిష్ కాంబినేషన్ లో సినిమా కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











