twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కృష్ణం వందే జగద్గురుం'లో రాణా క్యారెక్టరేంటి?

    By Srikanya
    |

    రాణా తాజా చిత్రం 'కృష్ణం వందే జగద్గురుం'లో ఓ డిఫెరెంట్ మాస్ క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ చిత్రానికి చెందిన కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం లో క్యారెక్టర్ గురించి హీరో రాణా మాట్లాడుతూ...నా పేరు బాబు. చదువు బీటెక్‌. ఈ మాత్రం చదువుకొంటే చాలు... ఓ మంచి ఉద్యోగం సంపాదించేసి, హాయిగా జీవితాన్ని గడిపేద్దాం అనుకొంటారు. కానీ బాబు అలా కాదు. ఏసీ గదుల్లో కూర్చుంటూ నెలకు వచ్చే నాలుగంకెల జీతంతో సంతృప్తి పడలేదు. అతని లక్ష్యం వేరే ఉంది. అదేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు రాణా.

    దర్శకుడు చెబుతూ ''కృష్ణుడికీ ఈ కథకూ సంబంధం ఏమిటనేది సస్పెన్స్‌. 'గమ్యం'లోని గాలి శీను, 'వేదం' సినిమాలోని కేబుల్‌రాజు వీరిద్దరికన్నా మా బీటెక్‌ బాబు మహా మాస్‌. రాణా పక్కన ఓ కొత్త హీరోయిన్ నటిస్తుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని''అన్నారు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్‌రెడ్డి నిర్మాతలు.

    English summary
    Rana says his character in Krishnam Vande Jagadgurum is Mass.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X