వర్తమాన దృశ్యం('కృష్ణం వందే జగద్గురుమ్‌' ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్: గమ్యం, వేదం చిత్రాల ద్వారా తానేంటో నిరూపించుకున్న దర్శకుడు క్రిష్. ఆయన తాజా చిత్రం కృష్ణం వందే జగద్గురుమ్‌. దగ్గుపాటి రాణా హీరోగా చేస్తున్న ఈ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. సురభి నాటక సమాజం బ్యాక్ డ్రాప్ లో మైనింగ్ మాఫియా నేఫధ్యంలో జరిగే యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం ఇది. ఇప్పటివరకూ విజయం ఎరగని రాణా ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

కథలో... సురభి సుబ్రహ్మణ్యం (కోట) కళ అంటే జాతిని జాగృతం చేసేది అని నమ్మిన మనిషి. నాటక బృందాన్ని నిర్వహిస్తుంటారు. ఆయన మనవడు బీటెక్‌ బాబు (రాణా). అతనికి నాటకాలపై ఏ మాత్రం ఆసక్తి ఉండదు. అవి భవిష్యత్తును ఇవ్వవు అని నమ్ముతాడు. వీసా వస్తే అమెరికా వెళ్లిపోవాలన్నది అతని ఉద్దేశం. తాత బలవంతమ్మీద నటిస్తుంటాడు. నాటకాల ప్రదర్శన నిమిత్తం బళ్లారి వెళ్తారు. అక్కడ బాబుకి దేవిక (నయనతార) అనే రిపోర్టర్‌ పరిచయమవుతుంది. బాబు ఆలోచనా దృక్పథం ఓ దశలో మారుతుంది. తన తాత రాసిన ఓ నాటకం అందుకు కారణమా? దేవిక మాటలు ప్రభావితం చేశాయా? అన్నది తెర మీదే చూడాలి. ఈ కథలో రెడ్డప్ప (మిలింద్‌ గునాజీ) వ్యవహారం కీలకం.

దర్శకుడు క్రిష్‌ మాట్లాడుతూ ''వర్తమాన అంశాలను స్పృశించే కథ ఇది. నాయకానాయికల పాత్రలు, వారి నటన ప్రేక్షకులకు నచ్చుతాయి. 'సై అంద్రీ నాను...' అనే గీతంలో వెంకటేష్‌ తళుక్కున మెరుస్తారు'' అన్నారు.

ఈ చిత్రం లో క్యారెక్టర్ గురించి హీరో రాణా మాట్లాడుతూ... నా పేరు బాబు. చదువు బీటెక్‌. ఈ మాత్రం చదువుకొంటే చాలు... ఓ మంచి ఉద్యోగం సంపాదించేసి, హాయిగా జీవితాన్ని గడిపేద్దాం అనుకొంటారు. కానీ బాబు అలా కాదు. ఏసీ గదుల్లో కూర్చుంటూ నెలకు వచ్చే నాలుగంకెల జీతంతో సంతృప్తి పడలేదు. అతని లక్ష్యం వేరే ఉంది. అదేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు రాణా.

సంస్థ: ఫస్ట్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నటీనటులు: రాణా, నయనతార, మిలింద్‌ గునాజీ, కోట శ్రీనివాసరావు, రఘుబాబు, బ్రహ్మానందం, హేమ, ఎల్బీ శ్రీరామ్‌, నాగినీడు, సత్యం రాజేష్‌ తదితరులు. ప్రత్యేక గీతంలో వెంకటేష్‌, సమీరారెడ్డి.
సంగీతం: మణిశర్మ
మాటలు: సాయిమాధవ్ బుర్రా,
కెమెరా: వీఎస్ జ్ఞానశేఖర్,
నిర్మాతలు: జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి
దర్శకత్వం: రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్‌)
విడుదల: శుక్రవారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X