మంచు లక్ష్మి అయింది..ఇప్పుడు రాణా ని సీన్ లోకి తెచ్చారు
హృతిక్ రోషన్ నటించగా ఘన విజయం సాధించిన హిందీ చిత్రం 'క్రిష్"కు పార్ట్-2గా రూపొందనున్న 'క్రిష్-2"లో ప్రతినాయకుడి పాత్ర కోసం రాణా పేరు పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ పాత్ర కోసం తొలుత అజయ్‌దేవగణ్‌ను సంప్రదించారని, తొలుత సానుకూలంగానే స్పందించిన దేవగణ్.. అనంతరం కారణాంతరాల వల్ల మనసు మార్చుకుని.. 'నో" చెప్పాడని.. దాంతో ఆ పాత్ర కోసం రాణా పేరు పరిశీలిస్తున్నారని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.అయితే ఇదంతా రాణా కు చెందిన వారు కావాలని చేస్తున్న ప్రచారమని మరో వాదన ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. హాలీవుడ్ లోనటిస్తున్నాడని, బాలీవుడ్ లో విపరీతమైన ఆఫర్స్ వచ్చేస్తున్నాయని రాణా గురించి పబ్లిసటి చేసి క్రేజ్ తేవాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దీన్ని కొట్టి పడేస్తున్నారు. అలాగే అప్పట్లో మంచు లక్ష్మి ని కూడా క్రిష్ 2 లో రోషన్ అడిగినట్లు వార్తలు వచ్చాయి. తర్వాత ఆమె కూల్ గా ఖండించింది. ఇదీ అలాగే జరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











