Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
తాతగా ఫుల్ హ్యాపీ...రామానాయుడు
నా పేరు పెట్టుకొన్న మనవడు విజయం సాధిస్తే తాతగా ఎంతో సంతోషిస్తున్నాను. లీడర్ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది అంటున్నారు ప్రముఖ నిర్మాత రామానాయుడు. 'లీడర్' రిలీజై శుక్రవారం నాటికి యాభై రోజులు పూర్తి చేసుకోబోకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనందాన్ని ఇలా వ్యక్తం చేసారు.ఆయన మాటల్లోనే...నటుడిగా మా రానా తొలి అడుగులోనే అందరికీ చేరువయ్యాడు. అసలు రానాతో మొదటి సినిమా మేమే నిర్మించాల్సి ఉంది. ఇంతలోనే శేఖర్ కమ్ముల, ఏవీఎమ్ సంస్థ సంప్రదించాయి. రెండో సినిమా మొదలుపెడదాం అనుకొనేలోగా హిందీ చిత్రం ఒప్పుకొన్నాడు. శ్రీరాఘవ దర్శకత్వంలో నటించే సినిమా మే నెలలో సెట్స్ మీదకు వెళ్తుంది అన్నారు. ప్రస్తుతం రానా హిందీలో 'దమ్ మారో దమ్'లో నటిస్తున్నారు. బ్లఫ్ మాస్టర్ రూపొందించిన రమేష్ సిప్పీ ఈ చిత్రం దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్ చేస్తున్నారు. రాణా సరసన బిపాసా బసు చేస్తోంది. రానా నటించే ద్విభాషా చిత్రానికి రంగం సిద్ధమైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రానికి శ్రీరాఘవ దర్శకత్వం వహిస్తారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శ్రీ రాఘవ గతంలో సురేష్ ప్రొడక్షన్స్ లో ఆడువారి మాటలకు అర్దాలే వేరులే చిత్రాన్ని చేసారు.