రానా, మిహిక ఎంగేజ్‌మెంట్.. మాట-ముచ్చట పూర్తి.. సంప్రదాయ దుస్తుల్లో దర్శనం

దగ్గుబాటి వారసుడు రానా ప్రేయసి, ప్రేమ, పెళ్లి విషయం సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ప్రేయసి యస్ చెప్పిందని రానా ప్రకటించిన మరు క్షణం నుంచి వార్తలు దావానంలా వ్యాప్తించాయి. రానా ప్రేయసి పేరు మిహికా బజాజ్ అని ప్రకటించిన వెంటనే గూగుల్‌లో వేట మొదలైంది. ఎవరీ అమ్మాయి? ఎక్కడ ఉంటుంది? ఏం చేస్తుంటుందని వెతుకులాట ప్రారంభించారు. ఇక నిన్న అయితే.. వీరిద్దరికి నిశ్చితార్థం అంటూ వార్తలు వచ్చేశాయి. నిశ్చితార్థం వార్తలను సురేష్ బాబు ఖండించినా.. ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు.

రానా-మిహికల వ్యవహారం..

రానా-మిహికల వ్యవహారం..

రానా మిహికల వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రోజురోజుకూ మిహికా ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇంతవరకు లైమ్ లైట్‌లో లేని మిహికా.. రానా ప్రకటనతో ఒక్కసారిగా ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది. నిన్నంతా వీరి నిశ్చితార్థం అంటూ వార్తలు వెలువడ్డాయి.

ఖండించిన సురేష్ బాబు..

ఖండించిన సురేష్ బాబు..

కేవలం ఇరు కుటుంబాల పెద్దల సమావేశం మాత్రమే ఉంటుందని సురేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం నిశ్చితార్థానికి ముందు ఇరు కుటుంబాల పెద్దలు కూర్చుని మంచి, చెడులు చర్చిస్తారని.. అలా తాము కూడా ఈ రోజు మిహికా బజాజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతామని సురేష్ బాబు తెలిపాడు.

త్వరలోనే చెబుతాం..

త్వరలోనే చెబుతాం..

నిశ్చితార్థం, వివాహం ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తామన్నాడు. పెద్దలు కూర్చుని అన్నీ మాట్లాడుకున్నాక రానా వివాహంపై మీడియాకు సమాచారం ఇస్తామని స్పష్టంగా వివరించాడు.అయినా నిశ్చితార్థం వార్తలు మాత్రం ఆగలేదు.

Recommended Video

Rana Daggubati Announced 'Its Offiacial' About The Marriage With Miheeka
రానా-మిహిక ఫోటోలు వైరల్..

రానా-మిహిక ఫోటోలు వైరల్..

ఇరు కుటుంబాల పెద్దలందరూ కూర్చుని వివాహ విషయమై చర్చించుకున్నారు. మాటముచ్చట పూర్తి కావడంతో వీరి పెళ్లి అధికారికంగా నిర్ణయించబడింది. ఇదే విషయాన్ని రానా చెబుతూ.. ఇట్స్ అఫీషియల్ అంటూ సంప్రదాయ వస్త్రాల్లో దిగిన ఫోటోలను షేర్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X