twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rana Miheeka Wedding: కొంత బాధగా ఉంది.. కానీ నో కాంప్రమైజ్.. సురేష్ బాబు కామెంట్

    |

    టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రానా దగ్గుబాటి పెళ్లికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం మధ్యాహ్నం నుంచి పెళ్లి వేడుకలు ఊపందుకొన్నాయి. రానా ఇంటిలో పెళ్లికొడుకు తయారు చేసే కార్యక్రమంతో వివాహ వేడుకలు మొదలు కాగా, పసుపు పూతతో పెళ్లికూతురును తయారు చేసే హల్దీ కార్యక్రమం మొదలైంది. పెళ్లి వేడుకల గురించి రానా తండ్రి, ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు వెల్లడిస్తూ..

    తెలుగు, మర్వాడీ సంప్రదాయాలు ప్రకారం

    తెలుగు, మర్వాడీ సంప్రదాయాలు ప్రకారం

    రానా, మిహిక బజాజ్ పెళ్లి కార్యక్రమాలు తెలుగు సంప్రదాయాలు, మర్వాడీ సంప్రదాయల ప్రకారం జరుగుతున్నాయి. ఇరు కుటుంబాల ఆచారాలను పాటిస్తూ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నాం. పెళ్లికి హాజరుకాలేని వారికి అనంతరం విందును ఏర్పాటు చేస్తాం అని మిహిక కుటుంబ సభ్యులు తెలిపారు.

    హల్దీ సెలబ్రేషన్ వీడియో వైరల్


    రానా, మిహిక పెళ్లిలో భాగంగా జరిగిన హల్దీ కార్యక్రమం జోష్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి సమంత అక్కినేని, నాగచైతన్య తదితరులు హాజరయ్యారు. అలాగే రానా, మిహికా కుటుంబాలకు సంబంధించిన కొద్ది మంది మాత్రమే గురువారం జరిగిన కార్యక్రమాల్లో పాలు పంచుకొన్నారు. ఈ వేడుకలో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాలకు రానా, మిహిక డ్యాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.

    లాక్‌డౌన్‌తో పెళ్లిని నిరాడంబరంగా

    లాక్‌డౌన్‌తో పెళ్లిని నిరాడంబరంగా


    ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనావైరస్ పరిస్థితులు చేజారి ఉన్నందున రానా పెళ్లి కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరిపించాలని నిర్ణయం తీసుకొన్నాం. అంతేకాకుండా కేవలం కుటుంబ కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. పెళ్లి వేదిక వద్ద బయో సెక్యుర్ బబుల్ ఏర్పాటు చేశాం. అక్కడే శానిటైజర్లను ఏర్పాటు చేశాం. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొంటున్నాం అని సురేష్ బాబు తెలిపారు.

    రాజీ పడే ప్రసక్తే లేదు

    రాజీ పడే ప్రసక్తే లేదు

    రానా పెళ్లిని అంగరంగ వైభవంగా చేయలేకపోతున్నామనే బాధ ఉంది. కానీ ప్రమాదకర వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో సురక్షిత చర్యలకే ప్రాధాన్యం ఇస్తున్నాం. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పెళ్లిలో సురక్షిత చర్యల విషయంలో రాజీ పడటం లేదు. ఈ పెళ్లికి 30 మంది కంటే ఎక్కువ మంది అతిథులను ఆహ్వనించలేదు నిర్మాత సురేష్ బాబు చెప్పారు.

    Recommended Video

    Rana Daggubati-Miheeka Bajaj’s Wedding Not Postponed
    శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో

    శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో


    రానా, మిహిక పెళ్లి ఆగస్టు 8వ తేదీన హైదరాబాద్‌కు తలమానికంగా మారిన తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరుగున్నది. శనివారం రాత్రి 8.30 గంటలకు హిందూ సంప్రదాయ పద్దతిలో పెళ్లికి ముహుర్తంగా నిర్ణయించారు. ఈ పెళ్లి కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను అందంగా ముస్తాబు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు ఫలక్ నుమా ప్యాలెస్‌కు చేరుకొన్నట్టు తెలిసింది.

    English summary
    Rana Daggubati reveals his relaation with Miheeka bajaj before Marriage. His wedding will be at Taj Falaknuma Palace in Hyderabad on August 8th, 2020 and time is 8.30pm. This marriage wille private affair due to coronavirus pandemic. In this occassions, Rana father, Producer Suresh babu told that only 30 guest were invited to marriage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X