రాణా 'నా ఇష్టం' ఆడియో రిలీజ్ డేట్ ఖరారు
దగ్గుపాటి రాణా తాజా చిత్రం నా ఇష్టం. చక్రి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో లాంచ్ డేట్ ఫిక్స్ చేసారు. మార్చి నాలుగున ఈ ఫంక్షన్ ఘనంగా రామానాయుడు స్టూడియోస్ లో జరగనుంది. అలాగే ఈ చిత్రాన్ని మార్చి 23న ఉగాది సందర్భంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని మీడియాకు రాణా కన్ఫర్మ్ చేస్తూ... నా ఇష్టం ఆడియో రామానాయుడు స్టూడియోస్ లో మార్చి నాలుగున జరగనుంది. ఆ రోజున సినిమాలోని క్లిప్స్ తో, అన్ని పాటల క్లిప్ లు, సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తాము అన్నారు. ఇక ఈ చిత్రంలో రాణా.. గణేష్ అనే స్వార్ధపరుడైన పాత్రలో కనిపించనున్నాడు. ఇక సుకుమార్ అశోసియేట్ అయిన ప్రకాష్ తోలేటి ఈ చిత్రాన్ని ఓ అద్బుతం జరగాలి అన్నట్లుగా చెక్కుతున్నాడని,గ్యారెంటీగా ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మరో ఆర్యలా సంచలనం క్రియేట్ చేస్తుందని అంటున్నారు.
నా ఇష్టంలో జెనీలియా కృష్ణ వేణిగా కనిపించి మురిపించనుంది. ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ.. నవతరం కుర్రాడి ప్రేమ, జీవితం చుట్టూ అల్లుకొన్న కథ ఇది. తన గురించి మాత్రమే ఆలోచించే ఆ యువకుడిలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. దాని వెనక కారణాలేమిటనే విషయాన్ని ఆసక్తికరంగా చెబుతున్నారు దర్శకుడు. వినోదం, భావోద్వేగాలకు ప్రాధాన్యముంది. యూనైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చక్రి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న వారిలో బ్రహ్మానందం, నాజర్, సుబ్బరాజు, ఆహుతి ప్రసాద్, అలి, ఉత్తేజ్ ప్రగతి తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











