‘నేను నా రాక్షసి’ అయిపోయింది వెంటనే ‘నేను నా ఇష్టం’
రాణా 'నా ఇష్టం' మే 6 నుంచి మొదలు కానుందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యునైటెడ్ మూవీస్ పతాకంపై, యువ హీరో దగ్గుబాటి రాణా హీరోగా, అందాల హాసిని జెనీలియా డిసౌజా హీరోయిన్ గా, ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సక్సస్ ఫుల్ యువనిర్మాత పరుచూరికిరీటి నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రం 'నాఇష్టం'. ఈ చిత్రం 'మే' ఆరవ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో హీరో రాణా పాత్ర అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని సమాచారం.
ఇక జెనీలియా పాత్ర కూడా అందుకు తక్కువేమీ కాదని తెలిసింది. జెనీలియాకు కూడా ప్రస్తుతం ఈ సినిమా హిట్టవటం చాలా అవసరం. ఇటీవల రాణా హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు బుజ్జి నిర్మించిన "నేను- నా రాక్షసి" చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అదీకాక రాణా ఇంకా తనను తాను ఒక పక్కా కమర్షియల్ మాస్ హీరోగా నిరూపించుకోవలసి ఉంది. అది అనుకున్నంత సులువైన సంగతేం కాదు. అందుకు రాణా ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది. తాను నటించబోయే పాత్ర గురించి మరింత శ్రద్ధ తీసుకుని చాలా హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











