రాణా పక్కా స్వార్దపరుడు: 'నా ఇష్టం' నిర్మాత
మా సినిమా హీరో పక్కా స్వార్దపరుడు. అతని ప్రపంచం తప్ప అతనికి మరేది కనపడదు. తన గొడవతనదే తప్ప వేరేదేమీ కనపడదు. కానీ అతని జీవితంలోకి కృష్ణ వేణి ప్రవేశించాక మొత్తం మారిపోతుంది. కృష్ణ వేణి పాత్ర చిత్రానికి కీ లాంటిది అంటున్నారు నా ఇష్టం నిర్మాత పరుచూరి కిరీటి. సింహా తర్వాత ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాణా హీరోగా కనిపించనున్నాడు. ఆ చిత్రం గురించి మీడియాతో ఇలా చెప్పుకొచ్చారు. ఇక రాణా మాట్లాడుతూ..ఆ యువకుడి పేరు గణేష్. ఆరడుగులు ఎత్తు ఉంటాడు కానీ... మనసు మాత్రం చాలా చిన్నది. ప్రతి విషయంలోనూ స్వార్థంగానే ఆలోచిస్తాడు. పక్కవాళ్లు ఏ సాయమడిగినా.. నాకేంటి లాభం? అని ప్రశ్నిస్తాడు. ప్రేమ విషయంలోనూ తనది అదే శైలి. కానీ కృష్ణవేణి తారసపడ్డాక మాత్రం అతని తీరు మారిపోయింది. అతని ఇష్టాయిష్టాల్లోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకొన్నాయి. ఇంతకీ ఆ కృష్ణవేణి ఎవరు? ఏమిటా కథ? తదితర విషయాలు తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు.
నా ఇష్టం లో కృష్ణ వేణిగా కనిపించి మురిపించనుంది. ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ ..నవతరం కుర్రాడి ప్రేమ, జీవితం చుట్టూ అల్లుకొన్న కథ ఇది. తన గురించి మాత్రమే ఆలోచించే ఆ యువకుడిలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. దాని వెనక కారణాలేమిటనే విషయాన్ని ఆసక్తికరంగా చెబుతున్నారు దర్శకుడు. వినోదం, భావోద్వేగాలకు ప్రాధాన్యముంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మలేషియాలో త్వరలోనే ఓ పాటని తెరకెక్కిస్తామని అన్నారు.. యూనైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చక్రి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న వారిలో బ్రహ్మానందం, నాజర్, సుబ్బరాజు, ఆహుతి ప్రసాద్, అలి, ఉత్తేజ్ ప్రగతి తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











