వావ్...ఇద్దరు సెక్సీభామలతో హీరో రానా(ఫోటోలు)
హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ఇద్దరు యంగ్ అండ్ సెక్సీ బ్యూటీలతో కలిసి 'వావ్' అనే మేగజైన్ కోసం ఆకట్టుకునే విధంగా ఫోజులు ఇచ్చారు. డిపార్ట్‌మెంట్ చిత్రంలో తనతో పాటు నటించిన నథాలియా కౌర్, తెలుగు హీరోయిన్ మధురిమలతో కలిసి వావ్ మేగజైన్ జూన్ నెల ఎడిషన్ కవర్ పేజీపై దర్శనం ఇచ్చారు.
ఇక్కడ గమనించ దగ్గ విషయం ఏమిటంటే....ఈ ముగ్గురు స్టార్లు సినిమా రంగంలో భారీ సక్సెస్ అనే రుచి ఎరుగని వారే. లీడర్ సినిమాతో హీరోగా తెరంగ్రేటం చేసిన రానా ఇప్పటి వరకు పలు చిత్రాల్లో నటించినా ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. రానా తోటి హీరోలంతా సక్సెస్‌లతో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటే.....రానా ఇంకా వెకబడే ఉన్నాడు.
అయితే రానా పర్సనాలిటీ, నటనలో ఉండే క్వాలిటీలతో అవకాశాలు మాత్రం భారీ ప్రాజెక్టుల్లోనే వస్తున్నాయి. ప్రస్తుతం రానా రాజమౌళి దర్శకత్వం వస్తున్న 'బాహుబలి' చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. అదే విధంగా అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'రుద్రమదేవి'లో కథానాయకుడిగా నటిస్తున్నాడు.

హీరో దగ్గుబాటి రానా, బాలీవుడ్ నటి నథాలియా కౌర్, తెలుగు సినిమా నటి మధురిమ వావ్ మేగజైన్ జూన్ కవర్ పేజీ కోసం ఫోటో షూట్లో పాల్గొన్నారు.

రామ్ గోపాల్ వర్మ ‘డిపార్ట్ మెంట్ ' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన నథాలియా కౌర్ ఆ సినిమా పరాజయంతో అక్కడ అవకాశాలు పెద్దగా రావడం లేదు. దీంతో సౌత్ సినీ పరిశ్రమపై కన్నేసింది. ప్రస్తుతం ఆమె గుణశేఖర్ ‘రుద్రమదేవి' చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఫోటో షూట్ల ద్వారా సౌత్ ఫిల్మ్ మేకర్స్‌ను ఆకట్టుకోవచ్చనేది ఆమె ఆలోచనగా కనిపిస్తోంది.

తెలుగు సినీ పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ అన్ని ప్లాపు సినిమాలే కావడంతో, మధురిమకు అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో తన ఇమేజ్ పెంచుకునేందుకు ఈ మధ్య ఫోటో షూట్లలో తెగ హడావుడి చేస్తోంది ఈ భామ.

ప్రస్తుతం రానా, మధురిమ, నథాలియా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రుద్రమదేవి' చిత్రంలో నటిస్తున్నారు.

వావ్ మేగజైన్ ఫోటో షూట్ సందర్భంగా ఈ ముగ్గురు స్టార్స్ చాలా సందడి గా గడిపారు.


Click it and Unblock the Notifications











