అయిదువేల సంవత్సరాల క్రితం రాణా

By Srikanya

సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.అయిదువేల సంవత్సరాల క్రితం కథతో సెల్వరాఘవన్‌ ఈ సినిమాను మలచనున్నారు. ఇది జానపదం అనొచ్చు..చరిత్రాత్మకం అనొచ్చు.అయితే ఇది పూర్తి వైవిధ్యమైన చిత్రం..అంటూ రాణా తన త్వరలో తాను చేయబోయే చిత్రం గురించి చెప్పుకొచ్చారు. అలాగే..ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందే చిత్రం. సాధారణంగా ఇలాంటి సినిమాలకు బడ్జెట్‌ ఎక్కువ అవుతుంటుంది. అలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడతాం. నాకు ప్రొడక్షన్‌ విషయంలో పూర్తి స్థాయి అవగాహన వుంది. అటు నిర్మాతగా, ఇటు హీరోగా వ్యవహరిస్తూ జనరంజకంగా ఈ చిత్రం ప్రజల ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాం అన్నారు. హీరోయిన్ గురించి చెబుతూ..హీరోయిన్ పాత్రకు ఎంపిక అమ్మాయిని ఎంపిక చేసుకొనే పనిలో ఉన్నాం. నా ఎత్తుకు సరిపడా అమ్మాయి అయితే బాగుంటుంది.ఓ నెలలోపు చిత్రీకరణ మొదలవుతుంది అని తెలియబరిచారు.

ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి ఈ చిత్రంలో రాణా ద్విపాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రం భారీ ఖర్చుతో రూపొందనుందని, ట్రెండ్ సెట్టర్ గా నిలవాలని సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. యుగానికొక్కడు..భారీ డిజాస్టర్ తో సెల్వ రాఘవన్ కూడా కసితో నిరూపించుకోవాలనే తపనతో ఉన్నారు. స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తయిందని, సెట్ డిజైన్ కోసం పలు ఆర్ట్ డైరక్టర్స్ ని సంప్రదిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకూ ఇండియన్ తెరపై రాని విధంగా ఆ చిత్రం కథని సమకూర్చారని, ఇందులో ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ప్రధానాంశాలుగా గ్రాఫిక్స్ కూడా ఉంటాయని అంటున్నారు. సురేష్ బాబు టార్గెట్..రాణాతో మగధీర రికార్డులు బ్రద్దలు కొట్టాలనే అని వినపడుతోంది. ఇక రాణా ప్రస్తుతం దమ్ మారో దమ్ అనే హిందీ చిత్రంలో చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో చేస్తున్న ఈ చిత్రంలో రాణా సరసన బిపాసాబసు చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X