»   » 'వేదం' క్రిష్ నెక్ట్స్ ఆ హీరోతో ఖరారు

'వేదం' క్రిష్ నెక్ట్స్ ఆ హీరోతో ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

గమ్యం, వేదం చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్.ఆయన తన తదుపరి చిత్రాన్ని రాణా తో చేయబోతున్నారు. ఈ విషయాన్ని రాణా తండ్రి సురేష్ బాబు కన్ఫర్మ్ చేసారు.ఆయన మాటల్లోనే...రాణా ప్రస్తుతం హిందీలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. తర్వాత మా సంస్థలో నిర్మించే చిత్రంతోపాటు క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తాడు అన్నారు. ఇక తమిళ వేదం రీమేక్ అనంతరం క్రిష్ ఏ ప్రాజెక్టు కమిట్ కాలేదు. రామ్ చరణ్ కి ఆ మధ్య కథ చెప్పారు కానీ..డేట్స్ కేటాయించటాకనికి చరణ్ కి చాలా కాలం పట్టేటట్లు ఉంది.

దాంతో క్రిష్ వెంటనే రాణాకి తన దగ్గరున్న స్క్రిప్టు వినిపించి ఓకే చేయించుకోవటం జరిగింది. గతంలోనూ సురేష్ ప్రొడక్షన్ లో వెంకటేష్ తో క్రిష్ దర్శకత్వంలో కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రం ప్రకటించారు. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. ఇక రాణా విషయానికి వస్తుతం ప్రస్తుతం తోలేటి ప్రకాష్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మించే నా ఇష్టం చిత్రం చేస్తున్నాడు. అలాగే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో డిపార్టమెంట్ అనే హిందీ చిత్రం కూడా షూటింగ్ లో రెండు రోజులనుంచి పాల్గొంటున్నాడు. దమ్ మారో దమ్, నేనూ నా రాక్షసి చిత్రాలు రెండూ ప్లాప్ కావటంతో రాణాకి అనుకున్నంత క్రేజ్ రాలేదు.

English summary
Jagarlamudi Radha Krishna (Krish) is going to join with young Daggubati shortly. With the film Gamyam,Vedam young director Krish has become a sensation in Tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu