»   » మెగాస్టార్ మూవీలో విలన్ పాత్ర చేయడం లేదు: రానా

మెగాస్టార్ మూవీలో విలన్ పాత్ర చేయడం లేదు: రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం గురించి ఇప్పటి వరకైతే అపీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు కానీ రకరకాల వార్తలు మాత్రం ప్రచారంలోకి వచ్చాయి.

బాహుబలి మూవీలో విలన్ పాత్ర భళ్లాలదేవుడిగా అదరగొట్టిన రానా...... 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రంలో విలన్ పాత్ర చేయబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై రానా స్పందించారు.

Rana Not a Part of Uyyalawada

ఉయ్యాలవాడకు చెందిన యూనిట్ సభ్యులెవరూ ఇంతవరకు తనను సంప్రదించలేదని రానా స్పష్టం చేసారు. తాను మెగాస్టార్ మూవీలో చేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని రానా వివరణ ఇచ్చారు.

రానా ప్రస్తుతం.... 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో పాటు మరో పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నాడు. బాహుబలి తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయిన రానా..... ఒక వేళ అవకాశం వచ్చినా చేయలేనంత బిజీగా ఉన్నాడు.

English summary
Tollywood Actor Rana Daggubati not a part of Megastar Chiranjeevi's period entertainer 'Uyyalawada Narasimhareddy'. The Baahubali star denies rumours on Uyyalawada Narasimhareddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu