»   » ‘బాహుబలి-2’ ప్రాజెక్ట్ నుండి రానా ఔట్

‘బాహుబలి-2’ ప్రాజెక్ట్ నుండి రానా ఔట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మీరు చదివింది నిజమే....'బాహుబలి-2' ప్రాజెక్టు షూటింగ్ నుండి రానా ఔట్ అయ్యాడు. అందుకు కారణం.... మరేదో ఊహించుకోవద్దు. రానా షూటింగ్ పార్టు పూర్తవ్వడమే. ఈ విషయాన్ని రానా స్వయంగా వెల్లడించారు.

'బాహుబలి' ఫస్టు పార్టుతో కలిపి చూస్తే.... షూటింగ్ గత మూడేళ్లుగా జరుగుతోంది. సినిమాలో హీరో ప్రభాస్‌, విలన్‌ రానా కీలకం కాబట్టి ఇద్దరూ ఇంతకాలం కలిసి పని చేసారు. దాదాపు మూడేళ్ల అనంతరం 'బాహుబలి' నుంచి విముక్తి లభించడంపై చాలా ఆనందంగా ఉన్నాడు రానా.

బాహుబలి రెండో భాగం షూటింగ్‌ దాదాపు పూర్తయింది. కేవలం పాటలు, కొంత ప్యాచ్‌ వర్క్‌ మాత్రమే మిగిలి ఉన్నాయి. పాటల్లో రానా అవసరం ఉండదు కాబట్టి రానా ప్రభాస్ కంటే ముందే బయట పడ్డాడు. తన తర్వాతి సినిమా ప్రారంభం కావడానికి కొంత సమయం ఉండటంతో కాస్త రిలాక్స్ అవుతున్నాడు.

తేజ దర్శకత్వంలో

తేజ దర్శకత్వంలో

తేజ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాను అక్టోబర్‌ 1వ తేదీ నుంచి మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు రనా. ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ది కంక్లూజన్

ది కంక్లూజన్

రాజమౌళి దర్శకత్వంలో గతేడాది వచ్చిన పార్ట్ 1 'బాహుబలి-ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరూ.... పార్ట్ 2 'బాహుబలి-ది కంక్లూజన్' ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం తెలసుకోవడానికైనా చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఏప్రిల్ 28న

ఏప్రిల్ 28న

రిలీజ్ ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పారు. బాహుబలి-2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెలిపారు.

కరణ్‌ జోహార్

కరణ్‌ జోహార్

ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బాలీవుడ్‌లో 'బాహుబలి'ని విడుదల చేసిన కరణ్‌... రెండో పార్ట్ బాహుబలి ది కన్ క్లూజన్ హిందీ వర్షెన్ ను కూడా డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్టు ప్రకటించారు. బాహుబలి అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో కూడా ఈ విషయాన్ని ప్రకటించారు.

English summary
Rana Out Of 'Baahubali' shooting, but Prabhas was virtually locked up in the film. At last, Baahubali part-II is nearing completion, except a couple of songs and other patch work.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu