»   »  బాహుబలి: వాళ్లు దొంగలే, దొరికిపోతారని హెచ్చరిక

బాహుబలి: వాళ్లు దొంగలే, దొరికిపోతారని హెచ్చరిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొన్ని నెలలు, సంవత్సరా పాటు కష్టపడి, భారీగా డబ్బు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారని, సినిమా పరిశ్రమపై ఎంతో మంది ఆధారపడి ఉన్నారు. అలాంటి సినిమాలను పైరసీ చేయడం అత్యంత దారుణమని, పైరసీకి పాల్పడటం... దొంగతనం చేయడం రెండూ ఒకటే అని నటుడు రానా పేర్కొన్నారు. మంగళవారం ఫిల్మ్ చాంబర్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రానా మాట్లాడుతూ పైరసీకి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు.

Rana over movie piracy

రాజమౌళి మాట్లాడుతూ...థియేటర్లలో నైట్ షో అయిన తర్వాత పైరసీ జరుగుతోందని, ఎవరు ఎక్కడ పైరసీ చేసినా వెంటనే దొరొకిపోతారు అని రాజమౌళి హెచ్చరించారు. బాహుబలి పెద్ద సినిమా... పెద్ద తెరపై చూడాల్సిన సినిమా అని రాజమౌళి అన్నారు. పైరసీ గురించి సమాచారం అందితే వెంటనే తెలియజేయాలన్నారు.

ఇటీవల బెంగుళూరులో పైరసీకి పాల్పడుతున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేయయడం రాజమౌళి హర్షం వ్యక్తం చేసారు. బెంగుళూరు పోలీసుల చొరవ కారణంగా పెద్ద పైరసీ భూతం నుండి బాహుబలి సినిమా బయట పడిందని రాజమౌళి చెప్పుకొచ్చారు. దేశంలోని సర్వీస్ ప్రొవైడర్లందరికీ ఈ పైరసీ సైట్ల వివరాలు అందించామని, ఆన్ లైన్ పైరసీ నియంత్రణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసామని తెలిపారు.

English summary
Daggubati Rana, one of the important casts of the movie Baahubali, addressing at the press meet, has appealed to people not to encourage piracy.
Please Wait while comments are loading...