చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది: రాణా
వేటూరి ఓ లెజండ్. లెజండ్స్ ఎప్పటికీ మరణించరు. వాళ్ళు మన హృదయంలో ఎప్పుడూ నివాశం ఉంటూనే ఉంటారు. నా కెరీర్ లో గుర్తుండిబోయే పాటలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు...అంటూ మహేష్ బాబు తనకిష్టమైన రచయిత వేటూరికి అంతిమ వీడ్కోలుగా ట్వీట్ చేసారు.
ఆమని పాడవే హాయిగా...అన్నట్లుగా ఆయన మనతోటే ఉన్నారు. తెలుగు వాళ్ళు ఎప్పటికీ మరవలేని వ్యక్తి వేటూరి. మనం ఉన్నంతకాలం ఆయన కూర్చిన పదాలు గాలిలో నడియాడుతూ మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాయి. ఆయనకు గుడ్ బై (అల్విదా) అంటూ నాగార్జున..ఇటీవల స్వర్గస్దులైన సినీ పాటల రచయిత వేటూరి గురించి ట్వీట్ చేసి శ్ర్ధద్దాంజలి ఘటించారు.
ఇక వేటూరి గారి గురించి రాణా దగ్గుపాటి స్పందిస్తూ...ఇన్నాళ్ళూ మన మధ్య నిలిచిన లెజెండ్ వేటూరి ఇక లేరు..యే శకుని ఆడని జూదం బ్రతుకేమో చదరంగం, ఇది ఆరని రావణ కాష్టం, చితిలోనే స్ధిమితం...అంటూ నా చిత్రం లీడర్ కి ఆయన రాసారు. చంద్రబోస్..వేటూరి గారి గురించి టీవీ నైన్ లో చాలా అధ్బుతంగా మాట్లాడారు. అది చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. నిజమైన సృజనాత్మకతకు అదే గౌరవం అన్నారు రాణా. ఇలా తెలుగు హీరోలు ట్విట్టర్ లో వేటూరి గారి గురించి తమ దైన శైలిలో స్పందించారు.


Click it and Unblock the Notifications











