సెక్సీ అనుష్కతో రామానాయుడి మనవడి రొమాన్స్...!
మూవీ మొగల్ రామానయుడు మనవడు రాణా దగ్గుబాటి హీరోగా...గమ్యం, వేదం చిత్రాల దర్శకుడు క్రిష్ 'కృష్టం వందే జగద్గురుమ్" అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో రాణాతో రొమాన్స్ చేసేందుకు టాలీవుడ్ సెక్సీ లేడీ అనుష్కను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో వేదిం సినిమాలో అనుష్కతో వేష్య పాత్రను వేయించి క్రిష్, తన తర్వాతి చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేయడం గమనార్హం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
ఈసినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తి చేసుకున్న క్రిష్, డిసెంబర్ 14 నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వెలవడే అవకాశాలు ఉన్నాయి.
అనుష్క ఇప్పటికే రాణా బాబాయ్ అయిన వెంకటేష్ తో నాగవల్లి చిత్రంలో నటించింది. బాబాయ్ అబ్బాయ్ లతో ఒకే హీరోయిన్ చేసే ఆనవాయితీ ఇప్పటి వరకు నంద మూరి కుటుంబంలోనే ఉండేది. తాజాగా ఇది రామానాయుడు కుటుంబానికి కూడా పాకిందనే గుసగుసలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











