ఘాజి తరువాత రానా మరో వార్ మూవీ.. ఈ సారి అలాంటి పాత్రలో!
రానా నటించిన ఘాజి చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఉత్తమ తెలుగు భాషా చిత్రంగా జాతీయ అవార్డుని కూడా కొల్లగొట్టింది. ఇండియా, పాక్ సబ్మెరైన్ వార్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని అబ్బుర పరిచింది. దర్శకుడ సంకల్ప్ రెడ్డి తొలి ప్రయత్నంలోనే ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
రానా విభిన్నమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంటూ నటుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. రానా ప్రస్తుతం హాథీ మేరె సాథీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కాగా రానా తదుపరి చిత్రంపై కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. ఘాజి చిత్రంలో నేవి అధికారిగా కనిపించిన రానా త్వరలో ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించబోతున్నాడంటూ ప్రచారం జరిగుతోంది.

బాలీవుడ్ కు చెందిన నిర్మాణ సంస్థ ఈ చిత్రం కోసం రానాతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ చర్చలు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నట్లు సమాచారం. దర్శకుడిగా తేజ పేరు వినిపిస్తుండడం విశేషం. తేజ రానాతో నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకున్నాడు.


Click it and Unblock the Notifications











