తన సినిమా వదిలేసి 'గబ్బర్ సింగ్' మోస్తున్న హీరో
తన సినిమా డిపార్టమెంట్ చిత్రం క్రిందటి శుక్రవారం విడుదలైనా దాన్ని ప్రమోట్ చేయటం మానేసి గబ్బర్ సింగ్ ప్రమోషన్ లో బిజీగ మునిగి తేలుతున్నాడు దగ్గుపాటి రానా. తన ట్విట్టర్ పేజీల్లోనూ, టీవీ ఛానెల్స్ లోనూ గబ్బర్ సింగ్ గురించే చెప్తున్నాడు. ఎక్కడా డిపార్టమెంట్ ఊసే ఎత్తటం లేదు. డిపార్టమెంట్ చిత్రం పీడకలగా మర్చిపోవాలని చూస్తున్నాడని,అందుకే ఇలా చేస్తున్నాడని చెప్తున్నారు. అయితే అదేం కాదు తన కృష్ణం వందే జగద్గురం చిత్రంలో గెస్ట్ గా పవన్ ని నటింపచేయాలని తాపత్రయంలోనే రానా ఇలా చేస్తున్నాడని కొందరు అంటున్నారు.
ఇక తాజాగ రానా టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ..నేను గబ్బర్ సింగ్ చిత్రం చూసాను. రియల్ పవన్ కళ్యాణ్ చిత్రం చాలా కాలం తర్వాత చూసాననిపించింది. హరీష్ కి ఇంత సూపర్ సక్సెస్ ఇచ్చినందుకు కంగ్రాట్స్ అన్నాడు. డిపార్టమెంట్ విషయంలో మాత్రం రానా చాలా ఉదాశీనంగా ఉన్నాడు. ఈ చిత్రంపై తన అంచనాలు గురించి చెపుతూ..సినిమా హిట్ ప్లాప్ లను ముందుగానే చెప్పగలిగేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరు. వర్మలాంటి దర్శకులతో పని చేస్తే చాలు... నటుడిగా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అంతకుమించి నేనేమీ ఆశించలేదు అన్నారు.
అలాగే రామ్ గోపాల్ వర్మ ది ఇరవయ్యేళ్ల అనుభవం. గుర్తుండిపోయే సినిమాలెన్నో తీశారు. ఆయనతో కలిసి పని చేయడం నాకు దక్కిన ఒక గొప్ప అవకాశం అన్నారు. అయినా అమితాబ్, సంజయ్‌దత్, రామ్‌గోపాల్‌వర్మ లాంటి అనుభవజ్ఞులతో కలిసి పని చేయడం గొప్ప మలుపుగా భావిస్తాను. ఇంకా ఆ సినిమా ఫలితం గురించి నేను ఆలోచించాలా? అని తేల్చి చెప్పారు.
మరో ప్రక్క రానా తెలుగులో క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం చేస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాణా బిటెక్ బాబుగా కనిపించనున్నాడు. ఆ పాత్ర డిఫెరెంట్ గా ఉంటుందంటున్నారు దర్శకుడు క్రిష్. అలాగే మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం ఒక్కడు ని రానా తో రీమేక్ చేయటానికి వర్మ ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్.ఎస్ రాజు నిర్మాతగా గుణ శేఖర్ డైరక్ట్ చేసిన ఈ చిత్రం త్వరలో బాలీవుడ్ లో రీమేక్ కానుంది. రామ్ గోపాల్ వర్మ స్వయంగా ఈ చిత్రాన్ని హిందీలో డైరక్ట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











