రాణా, పూరీ సినిమా చిత్రం ప్రారంభ విశేషాలు
లీడర్ ఫేమ్ రాణా, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న చిత్రం రామానాయుడు స్టూడియోలో నిరాడంబరంగా ప్రారంభమైంది. డాడి.రామానాయుడు, వెంకటేష్, సురేష్‌బాబు, నాగచైతన్య, ఇలియానా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. పూరి రూపొందించిన 'పోకిరి"లో నటించిన ఇలియానా మళ్లీ ఈ చిత్రంలో పూరి దర్శకత్వంలో రెండోసారి నటించనుంది. ఈనెల 13 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం షూటింగ్ కొంత పార్ట్ ఇటలీలో జరుగుతుంది. వెంకటేష్ తో బుజ్జి నిర్మించిన 'చింతకాయల రవి" చిత్రానికి సంగీతాన్నందించిన 'విశాల్-శేఖర్" ద్వయం ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. సుబ్బరాజు, ప్రదీప్‌రావత్, అలి, ముమైత్‌ఖాన్ ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రలు పోషించనున్నారు.
పూరీ జగన్నాధ్ రాణా లీడర్ లక్ష్మీ నరసింహా బుజ్జి ఇలియానా నాగచైతన్య naga chaitanya rana puri jagannath leader nallamalupu bujji ileana


Click it and Unblock the Notifications