»   » రానా ని ఈ ఫొటోల్లో చూస్తే ఆశ్చర్య పోతారు, కష్టం గురించి వింటే షాక్

రానా ని ఈ ఫొటోల్లో చూస్తే ఆశ్చర్య పోతారు, కష్టం గురించి వింటే షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మతంగా రూపొందుతున్న బాహుబలి సీక్వెల్ చిత్రం ది కన్‌క్లూజన్‌ కోసం భల్లాల దేవుడు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.. దగ్గుబాటి రానా ఈ పాత్రలో ఒదిగిపోవడానికి ఓ రేంజిలో రాంత్రిబవళ్లూ కసరత్తులు చేస్తున్నారు. ఆ విషయాలు మీకు అందిస్తున్నాం.

కోచ్‌ కునాల్‌ గిర్‌ పర్యవేక్షణలో వర్కౌట్‌ షెడ్యూల్స్‌ను తు.చ. తప్పకుండా పాటించటమే తన విజయ రహస్యమంటున్నాడు. దీనికోసం 31ఏళ్ల రానా నిత్యం రెండున్నరగంటలు కసరత్తులు చేస్తున్నారు. ఈ విషయాలను తాజాగా ముంబయి మిర్రర్ పత్రిక కోసం పంచుకున్నాడు.


ఆయన షెడ్యూల్‌ కూడా భిన్నంగా ఉండడంతో కార్డియో, వెయిట్‌ ట్రెయినింగ్‌ల్లో వివిధ రకాలుగా శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటికే బాహుబలి: ది కన్‌క్లూజన్‌ యాక్షన్‌ పార్ట్‌ను దాదాపు ఆయన పూర్తి చేశారు. మరో ఐదు రోజుల షూటింగ్‌ మిగిలివుంది.బాహుబలి కంటే బాహుబలి: ది కన్‌క్లూజన్‌లో మరింత ఫిట్‌గా కనిపించనున్నాడు ఈ యువహీరో. బాహుబలిలో రానా 108-110 కిలోల మధ్య బరువు ఉండేవాడు.. రెండో భాగంలో పాత్రకు అనుగుణంగా బరువు తగ్గాల్సి వచ్చింది. దీంతో కసరత్తులు చేసి 92-93 కిలోలకు చేరుకున్నారు.రానా డైట్‌ను కోచ్‌ కునాల్‌గిర్‌ డిజైన్‌ చేశారు. ప్రతి రెండున్నర గంటలకోసారి రానా పోషకాహారం తీసుకుంటున్నారు. దీనిలో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండేట్లు చూసుకుంటున్నారు. నూనెతో తయారుచేసిన పదార్థాలను పూర్తిగా దూరంపెట్టారు.


తన బాడీ ఎలా రూపుదిద్దుకుంటోందో కోచ్‌తో కలిసి నిత్యం పర్యవేక్షించుకుంటున్నాడు మన భల్లాలదేవుడు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటోను రానా తన ట్విట్టర్‌ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన కథనాన్ని ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించగా ఆ క్లిప్పింగ్‌ను కూడా రానా ట్విట్టర్‌లో పోస్టు చేశారు.


English summary
Rana admits that over the last five months he has been training for twoand-a-half hours every day. “I’ve been shuttling between cardio and weight training,” says the 31-year-old actor who has finished shooting his action sequences for Baahubali: The Conclusion and has just five days’ work left.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu