‘కృష్ణం వందే జగద్గురుం’లో రానా ఫస్ట్ లుక్

భిన్నమైన సినిమాలకు కేరాప్ అడ్రస్ గామారిన క్రిష్ కూడా....ఇప్పటి వరకు యాక్షన్ నేపథ్యాన్ని ఎంచుకోలేదు. తాజాగా 'కృష్ణం వందే జగద్దురుమ్" సినిమా యాక్షన్ అంశాలతో విభిన్నంగా తెరకెక్కుతోంది. నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది.
ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఖరారైంది. అక్టోబర్ 3న ఆడియో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈచిత్రం ఒకేసారి విడుదల కాబోతోంది.
ఈ చిత్రంలో రానా థియేటర్ ఆర్టిస్టుగా కనిపించున్నాడు. చదివింది బీటెక్. అందుకే అన్నీ హైటెక్ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నపాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి, దర్శకత్వం: క్రిష్.


Click it and Unblock the Notifications











