1000 థియేటర్లలో రాణా ‘కృష్ణం వందే జగద్గురుమ్’
హైదరాబాద్ : రాణా-నయనతార జంటగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం ఈ నెల 30న విడుదలకు సిద్ధం అవుతోంది. రాణా కెరీర్లోనే ఈచిత్రం భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాణా తండ్రి, ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ బాబు తన పలుకుబడి ఉపయోగించి కొడుకు సినిమాను 1000కిపైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
డిస్ట్రిబ్యూషన్ రంగంలో తన పవర్ ఉపయోగించి భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేసి రాణాకు కమర్షియల్ హిట్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడు. మరి తండ్రి అండతోనైనా రాణా బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటుతాడో లేదో చూడాలి. ఈ చిత్రం స్టోరీ విషయానికొస్తే... గనుల్ని కొల్లగొట్టి వ్యాపారం చేస్తూ భూమాతకు గర్భశోకం కలిగిస్తున్న అభినవ భూభకాసురుల్ని అంతమొందించే అభినవ కృష్ణుడు కథే 'కృష్ణం వందే జగద్గురుం'.
కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం నవంబర్ 5వ తేదీనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుంది. సెన్సార్ బోర్డు వారు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసారు. ఈచిత్రంలో సెన్సార్ కటింగ్ కు గురైన సన్నివేశాలు, డైలాగుల దాదాపు 14 పైనే ఉన్నాయి. ఇటీవల సినిమాలపై వివాదాలు ఎక్కువవుతుండటంతో సెన్సార్ బోర్డు వారు వీలైనన్ని ఎక్కువ కటింగులు పెట్టి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నారు.
ఈ చిత్రంలో రాణా థియేటర్ ఆర్టిస్టుగా కనిపించున్నాడు. నయనతార హీరోయిన్ గా రాణా సరసన చేస్తోంది. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఈ చిత్రం నవంబర్ 30న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి, దర్శకత్వం: క్రిష్.


Click it and Unblock the Notifications











