రాణా కెరీర్లోనే ఆ సినిమాకు బెస్ట్ రేటు
హైదరాబాద్ : దగ్గుబాటి రానా, నయనతార కాంబినేషన్ లో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'. ఈ చిత్రానికి సంబంధించిన యూఎస్ రైట్స్ రాణా సినీ కెరీర్లోనే అత్యధికంగా రూ. 90 లక్షలకు అమ్ముడు పోయాయి. రాణాకు అంత సీన్ లేక పోయినా....గమ్యం, వేదం లాంటి చిత్రాల దర్శకుడు క్రిష్, హాట్ బ్యూటీ నయనతార హీరోయిన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
మార్కెట్‌ని విస్తృతం చేసుకొనే క్రమంలో తెలుగు దర్శకులు, హీరోలు తమ చిత్రాల్ని రెండు భాషలకు అనుగుణంగా మలచుకొంటున్నారు. ఈ చిత్రం తమిళంలోనూ రిలీజ్ చెయ్యాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు మీడియాకు తెలియచేసారు. ఇప్పటి వరకు రాణా కెరీర్ లో ఫుల్ లెన్త్ యాక్షన్ సినిమా లేదనే చెప్పాలి. భిన్నమైన సినిమాలకు కేరాప్ అడ్రస్ గామారిన క్రిష్ కూడా....ఇప్పటి వరకు యాక్షన్ నేపథ్యాన్ని ఎంచుకోలేదు. తాజాగా 'కృష్ణం వందే జగద్దురుమ్" సినిమా యాక్షన్ అంశాలతో కూడుకుని ఉంటుందని అంటున్నారు.
ఈ చిత్రంలో రానా పేరు బాబు. చదివింది బీటెక్. అందుకే అన్నీ హైటెక్ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నపాత్రలో కనిపిస్తాడు.
నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఈ విషయం దర్శకుడు క్రిష్ చెపుతూ...''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్ బాబు మాస్ అయితే దేవిక క్లాస్. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు : సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి, దర్శకత్వ : క్రిష్.


Click it and Unblock the Notifications











