పవన్, చెర్రీ, ప్రభాస్, బన్నీ దగ్గుబాటి మాళవిక మ్యారేజ్(ఫోటోస్)
హైదరాబాద్: హీరో రాణా సోదరి మాళవిక వివాహం భరత్ అనే వ్యక్తితో ఈ నెల 5వన హైదరబాద్ నానక్ రాం గూడలోని రామానాయుడు స్టూడియో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన ఈ వేడుకకు సినీ ప్రముఖులు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
టాలీవుడ్ టాప్ హీరోలుగు కొనసాగుతున్న పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, ప్రభాస్, అల్లు అర్జున్ తో పాటు..... మాళవిక కుటుంబ సభ్యులైన వెంకటేష్, రాణా ఈ ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు బయటకు విడుదలయ్యాయి.

మాళవిక-భరత్ వివాహ దృశ్యం

పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్

పెళ్లి వేడుకలో పవన్, రామ్ చరణ్, శ్రీకాంత్ చిట్ చాట్, వాళ్లతో సంబంధం లేకుండా పెళ్లి వేడుకను సీరియస్ గా గమనిస్తున్న వెంకటేష్

పెళ్లి వేడుకలో ప్రబాస్, అల్లు అర్జున్, జయంత్ సి పర్జానీ ముచ్చట్లు. పక్కనే దీక్షాసేథ్

భార్య స్నేహరెడ్డితో అల్లు అర్జున్

పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న రాణఆ

వైభవంగా వివాహ మహోత్సవం
వధువు మాళవిక దేవి..... శ్రీమతి లక్ష్మి-శ్రీ డి. సురేష్ బాబు దంపతుల కూతురు, శ్రీమతి రాజేశ్వరి-డా. రామానాయుడుల మనవరాలు. వరుడు భరత్ కృష్ణ...డా.పద్మావతి-డా. రాజా మోహన్ రావు పొట్లూరి కుమారు. కొన్ని నెలల క్రితమే మాళవిక దేవి-భరత్ కృష్ణ ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లో జరిగింది.
చిత్తూరు వాస్తవ్యులైన భరత్ కుటుంబం బెంగుళూరులో సెటిల్ అయ్యారు. వారికి సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. మాలివిక మేనేజ్‌మెంట్ కోర్సులో గాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం కార్వీ కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తోంది. వెంకటేష్ వైఫ్ నీరజ అంకుల్ ఈ సంబంధం కుదిర్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











