twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతిథుల పళ్లెంలో అమృతం... దగ్గుబాటి వారింట వంటలు అదుర్స్...

    |

    భళ్లాలదేవుడు ఎట్టకేలకు తన దేవసేనను దక్కించుకున్నాడు. ఇక రామానాయుడు స్టూడియోనే మహిష్మతి రాజ్యమంత అందంగా ముస్తాబైంది. ఈరోజే రానా, మిహీకాల మూడు ముళ్ల ముచ్చట కావడంతో సర్వాంగ సుందరంగా సిద్ధమైన రామానాయుడు స్టూడియో మధ్యాహ్నమయ్యేసరికి ఘుమఘుమలాడిపోతోందట.

    కరోనా పుణ్యమాని కేవలం 30 మంది అతిథుల సమక్షంలోనే పెళ్లి తంతు కానిచ్చేస్తున్నా, ఎక్కడా ఆ హంగూ ఆర్భాటాలకు మాత్రం లోటు రానివ్వడంలేదు దగ్గుబాటి కుటుంబం. వివాహ వేడుకల్లో ఇరు కుటుంబాల సంప్రదయాలూ ప్రతిబింబించేలా చూసుకునేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఓ బృందం విచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక భోజన ఏర్పట్లు హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నామా ప్యాలెస్ కు అప్పగించినట్లు సమాచారం.

    Ranas wedding cusine is Mouth watering

    తెలుగు, మార్వాడిల సంప్రదయాలను ప్రతిబింబించే విధంగా అన్ని ఏర్పాట్లు జరగ్గా, భోజనం విషయంలో రాజస్థానీ వంటకాలతో పాటూ, తెలుగు వంటకాలకూ ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. ముఖ్యంగా మార్వాడీ వంటకాల్లో ముఖ్యమైన కచోరీ, పకోడీ, దాల్ బాటీ చూర్మా, లాల్ మాస్, గట్టే కీ సబ్జీ వంటివి ప్రత్యేకంగా తయారు చేయించారు.

    తెలుగు వంటకాల్లోనూ ప్రత్యేక శ్రద్ధే కనబరిచారని తెలుస్తోంది. అయితే, రానాకు ఢిల్లీ వంటకాలంటే ప్రత్యేకమై ఆసక్తి ఉండటంతో వాటికీ అతిథుల మెనూలో ప్రత్యేక స్థానం కల్పించనున్నారని తెలుస్తోంది.

    English summary
    Mouth watering cusine on Daggubati's wedding ceremony are impressing the guests As Special dishes were made according to both the family's tradition
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X