హాట్ ఆంటీతో కలిసి రాణా రియాల్టీ షో

By Bojja Kumar

దగ్గుబాటి యువ హీరో రాణా త్వరలో నేషనల్ వైడ్‌గా ప్రసారం అయ్యే ఓ టీవీ రియాల్టీ షోలో దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యుటివి వారు రాణాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 'The Chosen One' అనే పేరుతో రూపొందుతున్న ఈ రియాల్టీషోలో బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ ఆంటీ నేహ దూపియాతో కలిసి జడ్జిగా కనిపించబోతున్నాడు ఈ యువ హాట్‌రోబ్.

ఇటీవల ముంబైలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో రాణా, నేహా దూపియా ఈ రియాల్టీ షోకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చాలా ఆసక్తికరంగా ఈ రియాల్టీషో సాగుతుందని, ఈ షో ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.

ప్రస్తుతం రాణా బాలీవుడ్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'డిపార్ట్ మెంట్' చిత్రంలో నటిస్తున్నాడు. అదే విధంగా తెలుగులో క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం చేస్తున్నాడు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...'యుగానికొక్కడు', 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ త్వరలో దగ్గుబాటి రాణా హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించ బోతున్నారు. చాలా కాలం క్రితమే వీరి కాంబినేషన్ అనుకున్నప్పటికీ అనుకోనికారణాల వల్ల ఇప్పటి వరకు ఆచరణ సాధ్యం కాలేదు. మళ్లీ త్వరలో ఈ ప్రాజెక్టు ట్రాక్ మీదకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X