Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామానాయుడు స్టూడియోలో రాణా సిస్టర్ పెళ్లి
ఈ మేరకు ఇప్పటి నుంచే పెళ్లి ఏర్పాట్లు మొలు పెట్టారు. ఈ వేడుకకు బంధు మిత్రులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ సినీ రంగాలకు చెందిన ప్రముఖులు, కేంద్ర, రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులు కలిసి దాదాపు 10వేలకు పైగా అతిథులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
చిత్తూరు వాస్తవ్యులైన భరత్ కుటుంబం బెంగుళూరులో సెటిల్ అయ్యారు. వారికి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. మాలివిక మేనేజ్మెంట్ కోర్సులో గాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం కార్వీ కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తోంది. వెంకటేష్ వైఫ్ నీరజ అంకుల్ ఈ సంబంధం కుదిర్చినట్లు తెలుస్తోంది.
తమది సినిమా కుటుంబమే అయినా....మాలివిక పూర్తిగా సినిమా రంగానికి దూరంగా ఉంటూ వచ్చింది. తమ కుటుంబానికి సంబంధించిన సినిమా కార్యక్రమాలకు కూడా మాలవిక దాదాపుగా దూరంగా ఉంది. ఆమె పెళ్లి కూడా పూర్తిగా సినిమా రంగంతో సంబంధం లేని వ్యక్తితోనే చేస్తున్నారు. గతంలో రామానాయుడి కూతురు లక్ష్మిని నాగార్జునకు ఇచ్చి పెళ్లి చేయడం, ఆ తర్వాత విడాకులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాలవికను సినీ పరిశ్రమతో సంబంధంలోని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. వెంకటేష్ భార్య, పిల్లలు కూడా సినీ రంగానికి, సినిమా ఫంక్షన్లకు పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.