twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామానాయుడు స్టూడియోలో రాణా సిస్టర్ పెళ్లి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో రాణా దగ్గుబాటి సోదరి మాలవిక పెళ్లి భరత్ అనే వ్యక్తితో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 12న వీరి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. డిసెంబర్ 5న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ వివాహ మహోత్సవానికి హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో వేదిక అవుతోంది.

    ఈ మేరకు ఇప్పటి నుంచే పెళ్లి ఏర్పాట్లు మొలు పెట్టారు. ఈ వేడుకకు బంధు మిత్రులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ సినీ రంగాలకు చెందిన ప్రముఖులు, కేంద్ర, రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులు కలిసి దాదాపు 10వేలకు పైగా అతిథులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

    చిత్తూరు వాస్తవ్యులైన భరత్ కుటుంబం బెంగుళూరులో సెటిల్ అయ్యారు. వారికి సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. మాలివిక మేనేజ్‌మెంట్ కోర్సులో గాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం కార్వీ కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తోంది. వెంకటేష్ వైఫ్ నీరజ అంకుల్ ఈ సంబంధం కుదిర్చినట్లు తెలుస్తోంది.

    తమది సినిమా కుటుంబమే అయినా....మాలివిక పూర్తిగా సినిమా రంగానికి దూరంగా ఉంటూ వచ్చింది. తమ కుటుంబానికి సంబంధించిన సినిమా కార్యక్రమాలకు కూడా మాలవిక దాదాపుగా దూరంగా ఉంది. ఆమె పెళ్లి కూడా పూర్తిగా సినిమా రంగంతో సంబంధం లేని వ్యక్తితోనే చేస్తున్నారు. గతంలో రామానాయుడి కూతురు లక్ష్మిని నాగార్జునకు ఇచ్చి పెళ్లి చేయడం, ఆ తర్వాత విడాకులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాలవికను సినీ పరిశ్రమతో సంబంధంలోని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. వెంకటేష్ భార్య, పిల్లలు కూడా సినీ రంగానికి, సినిమా ఫంక్షన్లకు పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

    English summary
    Malavika Daggubati, younger sister of Rana and daughter of leading producer Suresh Babu, is getting married on December 5th. Venue for the marriage is fixed at Ramanaidu Studio.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X