twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కలకాలం చెప్పుకుంటాను, కళ్ళనీళ్ళతో రానా ఏమోషనల్ స్పీచ్

    ''మాహిష్మతి అనే సామ్రాజ్యంలో నేను గడిపిన క్షణాల గురించి కలకాలం చెప్పుకుంటాను. మళ్ళీ నేను మాహిష్మతికి వెళ్ళలేననే ఆ ఫీలింగ్ నన్ను బాధిస్తోంది'' అంటూ ఏమోషనల్ అయ్యాడు రానా.

    |

    బాహుబలి సినిమాను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నాడు జక్కన్న రాజమౌళి. ఆ సినిమాలో కీలకమైన 'మాహిష్మతి' సామ్రాజ్య నిర్మాణం చేసింది ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబు సిరిల్‌. రెండో విభాగానికి కూడా ఆయనే పని చేసాడు. ఈ సినిమా కోసం ఆయన ప్రతిష్టాత్మకమైన శంకర్‌ 'రోబో-2'ను కూడా వదులుకున్నారు.

    మాహిష్మతీ రాజ్యం

    మాహిష్మతీ రాజ్యం

    దాదాపు అయిదు సంవత్సరాల పాటు సాగిన సుధీర్ఘమైన బాహుబలి జర్నీ లో ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మాహిష్మతీ రాజ్యం తో ఒక అనుబందం ఏర్పడి పోయింది. అయితే కాలం ఎల్లప్పుడూ అలాగే ఉందదు కదా... ఇప్పుడు బాహుబలి పూర్తయిపోయింది, మాహిష్మతీ రాజ్యాన్ని తొలగించేసే సమయం కూడా వచ్చేసింది.

    మాహిష్మతీ నగరం ఇక కనిపించదు

    మాహిష్మతీ నగరం ఇక కనిపించదు

    కళ్ళముందు ఒక మహా సామ్రాజ్యంగా నిలిచిన మాహిష్మతీ నగరం ఇక కనిపించదు., ఆ సెట్టింగులని తీసివేస్తారు..... ఆ భాద ఎలా ఉంటుందో బాహుబలి టీం లో పని చేసిన వారికే తెలుస్తుంది. ఆ భాదని రానా బయటికి చెప్పేసాడు. ఇన్ని సంవత్సరాలుగా నిజం కాక పోయినా తమ దేశం గా భావించిన మాహిష్మతీ సామ్రాజ్యం ఇక సినిమాలోనే చూసుకోవాల్సి వస్తుంది అన్న ఫీలింగ్ భాదిస్తుందన్న విశయాన్ని అందరూ ఫీల్ అవుతున్నా అందరి తరఫునా తానే చెప్పేసాడు....

    ఎప్పటికీ నిలిచిపోయే శిల్పం

    ఎప్పటికీ నిలిచిపోయే శిల్పం

    బాహుబలి ప్రిరిలీజ్ ఫంక్షన్ లో మాహిష్మతి గురించి చెబుతూ ఉద్విగ్నానికి లోనయ్యాడు రానా. "కాలం కరిగిపోయే క్షణాల సమూహం అయితే.. బాహుబలి సినిమా ఎప్పటికీ నిలిచిపోయే శిల్పం అని ఆనాడే చెప్పాను. బాహుబలి విషయంలో ఈ మాటను నిజం చేసినందుకు థ్యాంక్స్. ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ వింటే.. నాకు చాలా గర్వంగా ఉంటుంది. అలాగే నాకు బాధ కూడా ఉంది'' అంటూ తన మనసులో ఉన్న బాధని చెప్పుకున్నాడు రానా.

    ప్రభాసే నా బెస్ట్ కో స్టార్

    ప్రభాసే నా బెస్ట్ కో స్టార్

    ''మాహిష్మతి అనే సామ్రాజ్యంలో నేను గడిపిన క్షణాల గురించి కలకాలం చెప్పుకుంటాను. నేను జీవితంలో ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రభాసే నా బెస్ట్ కో-స్టార్. అయితే ఇప్పుడు నా బాధ గురించి చెబుతాను. ఆల్రెడీ కళ్ళెమ్మటి నీళ్ళు కూడా వచ్చేశాయి. మళ్ళీ నేను మాహిష్మతికి వెళ్ళలేననే ఆ ఫీలింగ్ నన్ను బాధిస్తోంది'' అంటూ ఏమోషనల్ అయ్యాడు.

     మీ తిట్లే నాకు ఇష్టం.

    మీ తిట్లే నాకు ఇష్టం.

    ఇక ఈ సినిమాలో పనిచేసినప్పుడు రెండు మూడు రోజులకు ఒకసారి కీరవాణి సతీమణి వల్లీ గారు తనని తిట్టేవారని.. ఆమె ఇలా తిడుతుంటే తనకు రియల్ లైఫ్ లో శివగామి లా కనిపించేవారని చెప్తూ... "వల్లిగారూ ప్లీజ్..! నన్ను ఫోన్ చేసి 3 4 వారాలకు ఒకసారి తిట్టండి . మీ తిట్లే నాకు ఇష్టం.

    సాహోరే బాహుబలి

    సాహోరే బాహుబలి

    మీతో తిట్టించుకోవడానికి నేను ఎన్ని అవకాశాలు అయినా ఇస్తాను. అంటూ మాట్లాడిన రానా చివరగా.... "సాహోరే బాహుబలి..!'' అంటూ ప్రసంగం ముగించాడు... మాహిషమతీ గురించి రాన మాట్లాడినంత సేపూ ఆర్ట్ డిపార్ట్మెంట్లో పని చేసిన వాళ్ళలోనూ, రోజూ ఆ సెట్స్ మధ్య తిరిగిన సినిమా టీమ్ వాళ్ళలోనూ ఆ భాధ కనిపించింది.

    English summary
    Rana daggubati Who played as Ballaala Deva in Bahubali's Emotional speech about Mahishmati at Bahubali pre release event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X