సమంత పిచ్చకు ఒక అడ్రస్ దొరికింది: రానా దగ్గుబాటి

స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ బేనర్లపై తెర‌కెక్కిన చిత్రం ఓ బేబీ. సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్ నిర్మాత‌లు.

జూలై 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రానా సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమా బాగా ఆడుతుదని చెప్పారు

సినిమా బాగా ఆడుతుదని చెప్పారు

‘ఓ బేబీ' సినిమా ఎంత పెద్ద హిట్టయిదో చెప్పక్కర్లేదు. నేను వీకెండ్స్ సమయంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులకు ఫోన్ చేసి కలెక్షన్లు కనుక్కుంటూ ఉంటాను. వాళ్లు నెంబర్లు చెబుతున్నపుడు... సాధారణంగా మీ బేనర్ నుంచి వచ్చే సినిమాల కంటే చాలా బాగా ఆడేస్తుందని చెప్పారు.. అని రానా వెల్లడించారు.

సమంత పిచ్చకు అడ్రస్ దొరికింది

సమంత పిచ్చకు అడ్రస్ దొరికింది

మా నాన్న కోరిక నేను సంవత్సరానికి మూడు సినిమాలు చేయాలని, అంత టాలెంట్ అయితే నాకు లేదు. నాకు ఒక సినిమా మూడు సంవత్సరాలు పట్టేస్తుంది. సమంత.. నీ పిచ్చకు ఒక అడ్డస్ దొరికేసింది. నువ్వు ఎన్ని సినిమాలు కవాలంటే అన్ని సినిమాలు ఇక్కడ చేసుకోవచ్చు.... అని రానా వ్యాఖ్యానిచారు.

మహిళలు తీసిన సినిమా అయినా మగాళ్లకు నచ్చుతుంది

మహిళలు తీసిన సినిమా అయినా మగాళ్లకు నచ్చుతుంది

ఈ సినిమా మహిళలచే రూపొందించబడింది. మహిళల గురించి, వారి ఎమోషన్స్ గురించి చర్చించే సినిమా. అది కూడా మగాళ్ల మసును హత్తుకునే విధంగా... ఇలాంటి ఒక స్పెషల్ సినిమా తెలుగువారు ఆదరించారు. ఒక కొరియన్ కథను తెలుగు నేటివిటీకి తగిన విధంగా చేసిన నందినీ రెడ్డికి హాట్సాఫ్... అంటూ రానా ప్రశంసించారు.

పెద్ద సినిమాలను సైతం వెనక్కి నెట్టేస్తున్నాయి

పెద్ద సినిమాలను సైతం వెనక్కి నెట్టేస్తున్నాయి

పదేళ్ల క్రితం సమంత, నా కెరీర్ ఒకేసారి మొదలైంది. అప్పట్లో ఇలాంటి కొత్త సినిమాలు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. అలాంటి కథలు వచ్చేవి కాదు, వస్తే సరైన స్పందన ఉండేది కాదు. కానీ ఈ రోజు ఇలాంటి సినిమాలే మెయిన్ సినిమాలై పెద్ద సినిమాలను వెనక్కి నెట్టేస్తున్నాయని... రానా చెప్పుకొచ్చారు.

నన్ను పట్టుకుని ఏడ్చేస్తున్నారు: నందినీ రెడ్డి

నన్ను పట్టుకుని ఏడ్చేస్తున్నారు: నందినీ రెడ్డి

ఈ సినిమా చూడగానే కొందరు నన్ను పట్టుకుని ఏడ్చేశారు. కొందరు మా అమ్మ కనిపించిందండీ, మా నాయనమ్మ కనిపించిందంటూ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ నాతో పంచుకుంటున్నారు. సినిమా బావుంది, బాగా తీశారు, పలానా వారు బాగా చేశారు అంటే థాంక్సూ అని చెప్పేదాన్ని. వారి జీవితాల గురించి, ఎక్స్ పీరియన్స్ గురించి చెబుతుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. మా టీం మొత్తం తరుపున ఆడియన్స్‌కు హృదయ పూర్వక నమస్కారం పెడుతున్నాను. మాకు మళ్లీ లైఫ్‌లో ఇలాంటి ఎక్స్ పీరియన్స్ వస్తుందో లేదో తెలియదు...అని దర్శకురాలు నందినీరెడ్డి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X