'దగ్గుబాటి స్టాలిన్' అంటూ రానా చొక్కా విప్పిన వర్మ

By Srikanya

''లుక్ అద్భుతం. రానా స్క్వాజ్‌నెగ్గర్ దగ్గుబాటి స్టాలిన్ అనాలనిపిస్తోంది'' అని ట్విట్టర్‌లో పెట్టారు రామ్‌గోపాల్‌వర్మ. రానా, నతాలియాకౌర్ జంటగా 'అందం' అనే చిత్రం రూపొందించబోతున్నారు రాము. ఈ చిత్రం కోసం ఇటీవల రానా, నతాలియా పాల్గొనగా ఫొటోషూట్ కూడా చేసి విడుదల చేసారు. రానా హీరోగా నటించనున్న చిత్రం 'అందం'. నథాలియా కౌర్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి రామ్‌గోపాల్‌ వర్మ దర్శకుడు. ఈ చిత్రంకోసం హీరో,హీరోయిన్స్ పై ఇటీవలే ఫొటోషూట్‌ చేశారు. చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఈ విషయమై వర్మ మాట్లాడుతూ ''ప్రేమ, యాక్షన్‌ అంశాలతో కూడిన చిత్రమిది. ఇప్పటిదాకా నా సినిమాలన్నీ మురికివాడలు, ఇరుకు సందులు, చీకటి ఇళ్ల నేపథ్యంలోనే సాగాయి. అందుకు భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నా. మొత్తం విదేశాల్లోనే చిత్రీకరణ జరుపుతాం. అత్యంత అందమైన లొకేషన్లలో ఈ చిత్రాన్ని రూపొందించాలన్నది నా ఆలోచన'' అన్నారు. రానా-వర్మ కలయికలో తెరకెక్కుతున్న 'డిపార్ట్‌మెంట్‌' అనే చిత్రంలో నథాలియా ఒక ఐటం సాంగ్ చేసింది. ఆ సమయంలోనే ఆమెను హీరోయిన్ తీసుకొని 'అందం' అనే చిత్రాన్ని తీయబోతున్నానని వర్మ ప్రకటించారు. మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X