Don't Miss!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నాగ చైతన్యకి రానా పుట్టిన రోజు శుభాకాంక్షలు: హ్యాపీ బర్త్‌డే లిటిల్ కజిన్ అంటూ
నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా దగ్గుబాటి రానా చై మరో కజిన్ సుశాంత్ కూడా బర్త్ డే విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే బ్రో!! ఎప్పటికీ నువ్విలా నవ్వుతూనే ఉండాలి అంటూ సుశాంత్ ఓ వెరైటీ పిక్‌తో ట్వీట్ చేశారు
Recommended Video
సమంతాతో పెళ్ళి తర్వాత పెద్దగా వార్తల్లో కనిపించలేదు నాగచైతన్య "యుద్దం శరణం" కూడా నిరాశ పరచటంతో కాస్త నిరాశగా ఉన్నట్టున్న చైతు ఈ బర్త్ డేతో కాస్త జోష్‌లోకి వచ్చినట్టున్నాడు. పెళ్ళితర్వాత వచ్చిన మొదటి బర్త్ డే కావటం తో ఈ రోజు చైతన్యకి మరింత స్పెషల్ కానుంది.
|
దగ్గుబాటి రానా
అక్కినేనినాగార్జున కి నట వారసుడిగా పరిచయం అయిన నేటితరం యంగ్ హీరో నాగ చైతన్య. ఈ రోజు నాగ చైతన్య పుట్టిన రోజు. నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా అభిమానులు, సినీ వర్గాల నుంచి విషెస్ వెల్లువలా వస్తున్నాయి. తాజాగా దగ్గుబాటి రానా హ్యాపీ బర్త్‌డే లిటిల్ కజిన్ అంటూ చైతు పెళ్లి సమయంలో దిగిన పిక్‌ని జత చేశారు.
|
చై మరో కజిన్ సుశాంత్
చై మరో కజిన్ సుశాంత్ కూడా బర్త్ డే విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే బ్రో!! ఎప్పటికీ నువ్విలా నవ్వుతూనే ఉండాలి అంటూ సుశాంత్ ఓ వెరైటీ పిక్‌తో ట్వీట్ చేశారు. సవ్యసాచి మూవీ సెట్స్‌లో కూడా చైతు బర్త్‌డేని సెలబ్రేట్ చేశారు. డైరెక్టర్ చందు మొండేటి, వెన్నెల కిషోర్ తదితరుల సమక్షంలో చైతుతో కేక్ కట్ చేయించి బర్త్‌డేని నిర్వహించారు.
చందు మొండేటి
ఇప్పటివరకూ పెళ్ళి మూడ్‌లోనే ఉన్న చై ఇక కొత్త ప్రాజెక్ట్ ల మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాడట. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న సవ్యసాచి చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ సినిమానికి ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
మాధవన్ ఓ ప్రత్యేక పాత్ర
సవ్యసాచి చిత్రంలో విలక్షణ నటుడు మాధవన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల చిత్ర యూనిట్‌తో మాధవన్ జత కలిశారు. 20 తేదీ నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. మాధవన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలోని మాధవన్ పాత్ర చాలా కాలం గుర్తుండి పోతుందని చిత్ర యూనిట్ పేర్కొంటున్నది