నేనేం నామోషీ గా ఫీలవటం లేదు ...లీడర్ రాణా
ప్రస్తుతం మన పరిశ్రమలో ఫిలిం మేకర్స్ తగ్గిపోయి, ప్రపోజల్ మేకర్స్ పెరిగి పోయారు. పాపులర్ హీరోలు, దర్శకులు దొరికితే చాలు ...సినిమా ప్రారంభించేస్తున్నారు. స్క్రిప్ట్ విషయం పట్టించుకోవడం లేదు. ఇది నిజంగా బాధాకరం. పూర్తి స్క్రిప్ట్ తో ఇప్పుడు ఎంతమంది షూటింగ్ చేస్తున్నారో చెప్పమనండి. తాతయ్య, నాన్న, బాబాయి పూర్తి స్క్రిప్ట్ లేకుండా సెట్స్ కి వెళ్లరు. అదే అలవాటు నాకూ వచ్చింది అంటూ చెప్తున్నారు రాణా. త్వరలో ఆయన చిత్రాలు నేను నా రాక్షసి, దమ్ మారో దమ్ రిలీజ్ అవుతన్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే సినిమా చేయకుండా ఖాళీగా ఉంటె నామోషీగా ఫీల్ అయ్యే మనస్తత్వం కాదు నాది. సినిమా తర్వాత సినిమా అని కాకుండా.... మంచి సినిమా తర్వాత మంచి సినిమా అనే పద్ధతి లో వెళ్లాలని అనుకుంటున్నాను. రొటీన్ సినిమాలు, రెగ్యులర్ సినిమాలు పది చేసే కన్నా గుర్తుండి పోయే సినిమాలు రెండు చేసినా చాలు అనేది నా సిద్ధాంతం అంటున్నాడు రాణా. ఇక ఇలియానా తో పూరి జగన్ దర్శకత్వంలో నేను చేసిన 'నేను నా రాక్షసి' వచ్చే నెల మూడవ వారం విడుదల చేయాలనుకుంటున్నాము. ఇందులో నా పాత్ర పూరి జగన్ స్టైల్ లో ఉంటుంది. రాణా త్వరలో ఓ హాలీవుడ్ చిత్రంలోనూ నటించనున్నారు.


Click it and Unblock the Notifications











