twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నేను నా రాక్షసి'కి మధ్యలో ఇంటర్వెల్ వేయొద్దంటున్నారు

    By Srikanya
    |

    'నేను నా రాక్షసి' చిత్రాన్ని ఇప్పటికే నా ప్రెండ్స్, కావాల్సినవాళ్ళూ చూశారు. సినిమా చూసి వాళ్లు మధ్యలో ఇంటెర్వెల్ కూడా వద్దన్నారు. అంత ఇంటర్టింగ్ గా ఉంటుందీ చిత్రం అంటున్నాడు రానా. 'లీడర్‌'తో కథానాయకుడైన రానా ఇటీవలే హిందీలోనూ దమ్ మారో దమ్ అంటూ అడుగుపెట్టారు. 'నేను నా రాక్షసి'తో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఈ శుక్రవారం విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఇలా స్పందించారు. అలాగే తనకీ 'నేను నా రాక్షసి'చిత్రం గురించి ఏ రిఫెరెన్సూ దొరకలేదంటూ...నేను సినిమాల్లో పుట్టి పెరిగాను. భాషతో సంబంధం లేకుండా రోజూ ఏదో ఒక సినిమా చూస్తాను. టర్కీ, కొరియా చిత్రాలు కూడా వదిలిపెట్టను. ఇన్ని సినిమాలు చూసిన నాకు... ఎక్కడా ఇలాంటి కథ కనిపించలేదు. ప్రతి సినిమాకీ ఎక్కడో ఒక చోట పోలిక ఉంటుంది. కానీ ఈ చిత్రానికి మాత్రం నాకు ఆ అవకాశమే దొరకలేదు. ఇలాంటి సినిమా ఏదైనా ఒకటి చూపించండి సార్‌ అని పూరి జగన్నాథ్‌ని అడిగితే... 'నా స్క్రిప్టే నీకు రెఫరెన్స్‌' అని చెప్పారు. చిత్రంలో ఒక ప్రొఫెషనల్‌ కిల్లర్‌ పాత్ర పోషించాను. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచుతుంది అన్నారు.

    English summary
    Daggubati Rana’s forthcoming film ‘Nenu Naa Rakshasi’ directed by Puri Jagannath and produced by Nallamalupu Srinivas (Bujji) on the banner of Sri Lakshmi Narasimha Productions had completed shooting and post-production formalities recently and the first copy was submitted to Censor Board for certification.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X