గుండెలమీద చెయ్యేసి చెప్పమనండి: 'లీడర్' రాణా ఛాలెంజ్
ఈ రోజున మన తెలుగు సినిమా ఫీల్డ్‌లో బౌండెడ్ స్క్రిప్ట్‌తో షూటింగ్‌కు ఎంతమంది వెళ్తున్నారో గుండెలమీద చెయ్యేసి చెప్పమనండి? అంటున్నారు లీడర్ చిత్రంతో పరిచయమైన రాణా. ఆయన తాజా చిత్రం నేనూ నా రాక్షసి త్వరలో విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించారు. అలాగే ఈరోజున మన ఫిలిం ఇండిస్టీలో ఫిలిం మేకర్స్ తక్కువైపోయి ప్రపోజల్ మేకర్స్ ఎక్కువైపోయారు. లీడింగ్‌లో వున్న డైరెక్టర్లు, హీరోల డేట్లు సంపాదించుకుంటే చాలు అనే పరిస్ధితికి మన నిర్మాతల్లో చాలామంది వచ్చేశారు. ఇది నిజంగా బాధాకరం. హీరోల డేట్స్‌ను బట్టి షూటింగ్ ప్లాన్ చేసుకోవడంకంటే బాధాకరం ఏముంటుంది చెప్పండి?తాతగారు కానీ, నాన్నగారు కానీ, బాబాయికానీ చేతిలో బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్‌కు వెళ్ళడమన్నది ఎట్టి పరిస్ధితుల్లో చేయరు. అందువల్ల నాకు కూడా ఆ అలవాటే వచ్చింది అన్నారు.


Click it and Unblock the Notifications











