హిందీ చిత్రం ఆఫర్ ఎలా వచ్చిందంటే...రాణా
శేఖర్ కమ్ముల లీడర్' సినిమాతో హీరోగా పరిచయమైన రానా ప్రస్తుతం అభిషేక్ బచ్చన్‌తో కలిసి 'దమ్ మారో దమ్' అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రం తనకు ఆఫర్ వచ్చిన విధానం గురించి రాణా వివరిస్తున్నారు. 'లీడర్' సినిమా షూటింగ్ సమయంలోనే నాకు ఈ అవకాశం వచ్చింది. బాంబేలో నా ఫొటోసూట్స్ చూసి ఆ కేరెక్టర్ ఆఫర్ చేశారు' అన్నారు . అలాగే లీడర్ లాంటి చిత్రాలను ఆదరించడం వల్ల మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది. సినిమా చేసేటప్పుడు ఎలాంటి సక్సెస్ వస్తుందని ఊహించానో అటువంటి విజయాన్నే ప్రేక్షకులు ఇచ్చారు. తాతగారు సినిమా చూసి చాలా ఆనందించారు. బాబాయికి కూడా చిత్రం బాగా నచ్చింది అని చెప్పుకొచ్చారు. ఇక 'దమ్ మారో దమ్' చిత్రంలో తన పాత్ర గురించి చెపుతూ... ' ఈ సినిమాలో నేను గోవా యువకుడిగా నటిస్తున్నాను. ఇందుకోసం గిటార్, బైక్ రైడింగ్ నేర్చుకున్నాను. సినిమాలో నేను కొంకిణి భాష మాట్లాడాలి. సినిమాకు ప్రత్యేకంగా డబ్బింగ్ చెప్పడమని ఉండదు. షూటింగ్ జరుగుతుండగానే వాయిస్ రికార్డ్ చేస్తారు అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











